
అయితే ఇప్పుడు ఒక స్టార్ హీరో భార్య తాను ఏడేళ్లుగా నరకం అనుభవిస్తున్నాను అని వేధింపులకు గురవుతున్నట్లు స్వయంగా వెల్లడించడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ కుమారన్ భార్య సుప్రియ మీనన్ ఆన్లైన్లో వేధింపులకు గురవుతున్నట్లు తెలిపింది . దాదాపు 2018 నుంచి ఆమె ఈ వేధింపులకు గురవుతున్నాను అంటూ తెలిపింది . ఈ మేరకు ఆమె పోస్ట్ వైఅర్ల్ అవుతుంది.
"2014 నుంచి ఈ మహిళ నాకు తెలుసు . తనకు చిన్నపిల్లాడు ఉన్నాడు అన్న కారణంగా నేను ఇన్ని రోజులు ఈ విషయాలను బయట పెట్టలేదు . ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనుకోలేదు . కానీ ఇప్పుడు నా తండ్రిపై కూడా నిందలు వేస్తూ కామెంట్స్ చేస్తుంది . ప్రస్తుతం ఆయన భౌతికంగా మా మధ్య లేకపోయినప్పటికీ హింసిస్తుంది . నేను ఎన్నోసార్లు బ్లాక్ చేశాను . ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మళ్లీ మళ్లీ నన్ను ఇబ్బంది పెడుతుంది. నన్ను బాధపెట్టడం ఆమె పని అయిపోయింది. ఆమె క్రియేట్ చేసుకున్న ప్రతి ఖాతాను బ్లాక్ చేయడం నాకు రోజు అలవాటైపోయింది" అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ఇండస్ట్రీలో దుమారం రేపుతుంది..!!