టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో అనేక మంది లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ లేడీ ఫ్యాన్ ఒకరు ఈ మధ్య కాలంలో తెగ వైరల్ గా మారింది. ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె పేరు నివిత. తాజాగా పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జూలై 24 వ తేదీన విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ లో భాగంగా పవన్ కళ్యాణ్ తన లేడీ అభిమాని అయినటువంటి నివిత ను స్టేజ్ పైకి పిలిచి మాట్లాడాడు.

ఇక నివిత స్టేజ్ పైన పవన్ తో ఫోటో దిగి స్టేజి మీదే గంతులు వేసింది. దానితో ఒక్క సారిగా ఈమె వైరల్ గా మారింది. ఆ తర్వాత నుండి ఈమె వరస పెట్టి ఇంటర్వ్యూలను ఇస్తూ వస్తుంది. అలాగే ఆ ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంత అభిమానం  , పవన్ గురించి ఎలాంటి పనులు చేశాను అనే దానిని వివరిస్తూ వస్తుంది. దానితో ఈమె మరింత వైరల్ గా మారుతూ వస్తుంది. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె పవన్ పై ఉన్న అభిమానం గురించి మరో ఇన్సిడెంట్ ను చెప్పుకొచ్చింది. తాజాగా నివిత ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని. నేను పవన్ కి పెద్ద ఫ్యాన్ అని మా చుట్టు పక్కల వారందరికీ తెలుసు.

అలాగే మా బంధువులకు కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతూ ఉంటే నేను వచ్చానంటే వెంటనే దానిని ఆపేస్తూ ఉంటారు. ఒక సారి నేను మా క్లోజ్ రిలేటివ్ తో కారులో వెళుతున్నాను. ఆ సమయంలో ఆమె పవన్ కళ్యాణ్ కి పాలిటిక్స్ ఎందుకు , అసలు సక్సెస్ కాడు అని అంది. వెంటనే నాకు కోపం వచ్చింది. ఆమెతో పెద్ద గొడవ పెట్టుకున్నాను. ఇక గొడవ ముదరడంతో నేను కారు దిగి నడుచుకుంటూ వెళ్లిపోయాను. ఆ విషయం మా ఇంట్లో తెలిసి నన్ను తిట్టారు అని నివిత తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: