సినిమా ఇండస్ట్రీ లో అందం , అభినయం , నటన వీటితో పాటు మంచి విజయాలు ఉన్న వారికి క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతాయి అనే వాదనను అనేక మంది వినిపిస్తూ ఉంటారు. కొంతమంది విషయంలో మాత్రం ఇది రాంగ్ అని సందర్భాలు కూడా ఉన్నాయి. అద్భుతమైన అందం , అభినయం , నటన మరియు విజయాలు కూడా ఉన్న కొంత మంది కి అవకాశాలు పెద్దగా దక్కని బ్యూటీలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో నేహా శెట్టి కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఆకాష్ పూరి హీరోగా రూపొందిన మెహబూబా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈమె పలు సినిమాలలో నటించింది. ఈమె కొంత కాలం క్రితం డిజే టిల్లు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో నేహా శెట్టి తన అందంతో , నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో ఒక్క సారిగా ఈమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత ఈమెకు వరస పెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె నటించిన బెదురులంక 2012 మూవీ మంచి విజయాన్ని సాధించింది. అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇలా ఈమె నటించిన సినిమాల్లో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే ఈమె ఆ మూవీలలో తన నటనతో , అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఇలా ఇప్పటివరకు ఈమె తక్కువ సినిమాల్లో నటించినా ఎక్కువ సినిమాలతో మంచి విజయాలను అందుకొని తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రస్తుతం ఈమె చేతులో అదిరిపోయే క్రేజ్ ఉన్న సినిమాలు మాత్రం లేవు. ఇది ఇలా ఉంటే ఈమె ఎప్పటికప్పుడు తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈమె హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను ఈమె తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ns