
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు, నటుడు రవిబాబు తండ్రి చలపతిరావు వారసుడిగా రంగ ప్రవేశం చేశాడు. నటనకంటే దర్శకత్వం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండటంతో, తొందరగానే మేకింగ్ వైపు మళ్లిపోయారు. 2002లో విడుదలైన 'అల్లరి' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాతోనే అల్లరి నరేష్ హీరోగా తెరపైకి వచ్చారు. అల్లరి విజయం తర్వాత రవిబాబు తాను దర్శకుడిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలమని ఫ్రూవ్ చేసుకున్నాడు. రవిబాబు తనదైన శైలిలో సినిమాలు తీయడంలో ప్రత్యేకత కనబరిచారు. ‘నచ్చావులే’, ‘అమ్మాయిలు అబ్బాయిలు’, ‘నువ్విలా’, ‘అనసూయ’, ‘అమరావతి’, ‘అవును’ వంటి విభిన్న కథాంశాలపై సినిమాలు తీసి ప్రేక్షకుల మనస్సులు గెలుచుకున్నాడు.
ఇక రవిబాబు డైరెక్ట్ చేసిన సినిమాలలో సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన 'సోగ్గాడు' సినిమాకు అప్పట్లో మంచి బజ్ ఏర్పడింది. 1975లో శోభన్ బాబు హీరోగా నటించిన అదే టైటిల్‌ను రవిబాబు తీసుకుని, తనదైన శైలిలో రీమేక్ చేయాలనుకున్నారు. తరుణ్ – ఆర్తీ అగర్వాల్ జంటగా తీసిన ఈ సినిమాలో, మూడో పాత్రకు హీరో ఉదయ్ కిరణ్ ను ఎంచుకున్నారు. అప్పట్లో ఈ ముగ్గురు హీరోలు తెలుగు యూత్‌లో మంచి క్రేజ్‌తో ఉన్నారు. అయితే ఉదయ్ కిరణ్ ఈ సినిమా చేయలేనని చెప్పడంతో రవిబాబు కాస్త ఫీల్ అయ్యారట.
ఉదయ్ కిరణ్ స్థానంలో హిందీ నటుడు జుగల్ హన్సరాజ్ ను తీసుకోవడమే సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది. తెలుగు ప్రేక్షకుల మైండ్ సెట్‌కి అతడి నటన నచ్చలేదు. దీంతో ఆ పాత్ర బలహీనంగా మిగిలిపోయింది. ఫైనల్‌గా సినిమా డిజాస్టర్ అయ్యింది. ఉదయ్‌ను ఓపికతో ఒప్పించి ఈ సినిమాలో నటింపజేస్తే ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని రవిబాబు పలు సందర్భాల్లో చెప్పారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు