విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఎదుగుతున్నారు. మొదట్లో ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీయర్ మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లోనే స్టార్ అయ్యారు. ముఖ్యంగా ఆయన చేసిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలు  ఎంతో పేరు తీసుకువచ్చాయని చెప్పవచ్చు. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత రౌడీ హీరోగా మారిపోయారు. ఇక ఈయన కెరియర్ లో అర్జున్ రెడ్డి సినిమాకి ముందు ఒక లెక్క ఆ తర్వాత మరో లెక్క అనే విధంగా తయారయ్యింది. అలాంటి విజయ్ దేవరకొండ తనకు వచ్చినటువంటి ఒక ప్రముఖమైన అవార్డును కూడా అమ్ముకున్నారట. దీనివల్ల తాను తీసుకున్న రెమ్యునరేషన్ కంటే అవార్డును బయట వేలంలో పెడితే 5 రేట్లు ఎక్కువ వచ్చినట్టు ఆయన తెలియజేశారు. ఆ అవార్డు ఏంటి వివరాలు చూద్దాం.. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో 'కింగ్డమ్' చిత్రాన్ని చేశారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేసింది.  ఇందులో విజయ్ నటనకు మంచి ఆదరణ దక్కిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్  అందుకుంది. అలాంటి ఈ తరుణంలో సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు విజయ్ తన కెరియర్ లోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. తాను పెళ్లిచూపులు సినిమా ద్వారా హిట్ అందుకున్నానని, కానీ ఆ తర్వాత చేసిన అర్జున్ రెడ్డి మూవీ తన కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిందని చెప్పారు.

అర్జున్ రెడ్డి చిత్రానికి విజయ్ దేవరకొండ కేవలం రూ:5లక్షలు మాత్రమే పారితోషి కం తీసుకున్నారని అన్నారు. కానీ 'కింగ్డమ్' చిత్రానికి వచ్చేసరికి రూ:60 కోట్లకు చేరిందని వార్తలు వినిపిస్తున్నాయి. కట్ చేస్తే అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆయనకు అనేక అవార్డులు లభించాయి. ఇందులో ఉత్తమ నటుడిగా జీ సినీ అవార్డు, సైమా, ఫిలింఫేర్ అవార్డులు కూడా సొంతమయ్యాయి. ఇందులో ఒక అవార్డును వేలంలో పెడితే రూ:25 లక్షల ధర వచ్చిందట. అంటే విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్ కంటే ఐదు రేట్లు ఎక్కువగా వచ్చిందని ఆయన తెలియజేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: