రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'కూలీ' సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ రోజున ఉద్యోగులకు సెలవు ప్రకటించి యూనో అక్వా కేర్ అనే సంస్థ తమ అభిమానాన్ని చాటుకుంది. ఉద్యోగుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ సెలవు బెంగళూరు, చెన్నై, తిరుచ్చి, మట్టుతవాని, అరపాలయం, మధురై, చెంగల్పట్టు, తిరునల్వేలి బ్రాంచ్‌లలోని ఉద్యోగులందరికీ వర్తిస్తుంది.

గతంలో రజనీకాంత్ నటించిన 'కబాలి' సినిమా విడుదలైనప్పుడు కూడా కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇలాగే సెలవులు ప్రకటించాయి. 'కబాలి' సినిమా మొదటి రోజు కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు 'కూలీ' కూడా 'కబాలి' మ్యాజిక్‌ని రిపీట్ చేస్తుందా లేదా అని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. కూలీ సినిమా రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుపుకోగా  కూలీ సినిమా  ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

లోకేష్ కనగరాజ్  గత సినిమా లియో ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. లియో సినిమా ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ విషయంలో నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. కూలీ సినిమా మాత్రం కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రస్తుతానికి వార్2 సినిమాతో పోలిస్తే కూలీ సినిమానే పైచేయి సాధిస్తోందని చెప్పాలి. కూలీ మూవీ ఫస్ట్  డే కలెక్షన్లు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండే అవకాశం అయితే ఉంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: