
మరి కొన్ని గంటలలో థియేటర్లకు రాబోతున్న ఈ రెండు చిత్రాలు మొదటి రోజు వందల కోట్ల రూపాయల మార్కు దాటేస్తాయని అంచనా వేస్తున్నారు అభిమానులు. ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్ 2 సినిమా మొదటి రోజు రూ .100 కోట్ల రూపాయల మార్కు దాటుతుందని.. నార్త్ లో బుకింగ్స్ కి తోడుగా ఆంధ్రప్రదేశ్లో కూడా టికెట్ల రేట్లు భారీగా పెంచడంతో ఈ సినిమా అనుకున్న టార్గెట్ ని సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అంతేకాకుండా వార్ 2 సినిమా కంటే కూలీ చిత్రానికి ఎక్కువగా కలెక్షన్స్ ఉండబోతున్నాయట.
కూలీ సినిమాకి ఫస్ట్ డే రూ .140 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రజిని కాంత్ స్టార్ డమ్ కి అలాగే డైరెక్టర్ కి ఉన్న క్రేజ్ తోడు కావడంతో పాటుగా అటు ఉపేంద్ర ,నాగార్జున పూజా హెగ్డే తదితర నటీనటులు ఉండడం చేత ఈ సినిమా ట్రైలర్ తోనే మంచి పెద్ద హిట్ అవ్వడం ఖాయమని భావించారు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇప్పటికే 2 మిలియన్ డాలర్లను దాటిపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఓపెనింగ్స్ తోనే ఈ రెండు చిత్రాలు సరికొత్త రికార్డులను సృష్టించబోతున్నట్లు కనిపిస్తోంది. మరి ఇందులో ఏ సినిమా కంటెంట్ బాగుంటే ఆ చిత్రమే ఎక్కువ రోజులు ఆడుతుందని, మిగిలిన చిత్రం ఓపెనింగ్స్ తోనే సరిపేటు కుంటుందని పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.