
అయితే, ఇటీవల మాత్రం ఆలియా భట్ ఫుల్ కోపంతో ఊగిపోయింది. ఆలియా భట్ ఫిట్‌నెస్ కోసం కసరత్తులు చేస్తుందనేది అందరికీ తెలిసిందే. ముంబైలోని తన నివాసం వద్ద పాడేల్ బాల్ ఆడుతూ ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల అక్కడ మరోసారి దర్శనమిచ్చింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. అంతకుముందే అక్కడికి వచ్చిన ఆలియాను కారు దిగగానే ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. “ఫోటోలు… ఫోటోలు…” అంటూ విసిగించారు. ఫోటోలు తీయడానికి ఆమె వెంటపడ్డారు. ఆలియా కొంత అసహనం వ్యక్తం చేసింది.
అయితే, ఏకంగా ఆలియాతో పాటు బిల్డింగ్ లోపలికి వెళ్లేందుకు కొంతమంది ఫోటోగ్రాఫర్లు ప్రయత్నించడంతో, ఆలియా ఫుల్ కోపంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. “లోపలికి రావద్దు… దయచేసి బయటకు వెళ్లిపోండి… ఇది మీ ఇల్లు కాదు” అంటూ ఫైర్ అయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీనిపై ఆలియా భట్‌కు జనాలు సపోర్ట్ చేస్తున్నారు .. “సెలబ్రిటీ ల వక్తిగత జీవితం కూడా పంచుకునే హక్కు మీకు లేదు. ఆమె పర్సనల్ లైఫ్‌కు ప్రైవసీ ఇవ్వండి. . ఫోటోగ్రాఫర్లు కొంచెం పద్ధతిగా ప్రవర్తించాలి” అంటూ ఆలియా అభిమానులు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు ..