కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో ధనుష్ ఒకరు. ఈయన కొంత కాలం క్రితం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర అనే సినిమాలో హీరో గా నటించాడు. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... టాలీవుడ్ సీనియర్ స్టార్ నటలలో ఒకరు అయినటువంటి నాగార్జునమూవీ లో అత్యంత కీలకమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ధనుష్ ప్రస్తుతం ఇడ్లీ కడాయ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ఇడ్లీ కడాయ్ మూవీ లో అరుణ్ విజయ్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు , ఆయనకు భార్య పాత్రలో విజయ్ దేవరకొండ హీరో గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ లో హీరోయిన్గా నటించిన శాలిని పాండే కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఇడ్లీ కడాయ్ మూవీ లో అరుణ్ విజయ్ కి భార్య పాత్రలో నటించడం కోసం శాలిని పాండే మూవీ బృందం వారు సంప్రదించగా , ఆమె ఈ సినిమాలో అరుణ్ విజయ్ కి భార్య పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. నిజం.గానే ధనుష్ హీరో గా రూపొందుతున్న ఇడ్లీ కడాయ్ మూవీ లో అరుణ్ విజయ్ కి భార్య పాత్రలో నటించే అవకాశం శాలిని పాండే కి వచ్చినట్లయితే అది ఈమెకు మంచి అవకాశం అవుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: