
నందమూరి నటసింహం బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక ప్రత్యేకమైన క్రేజ్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాలు వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నాయి. “సింహా”, “లెజెండ్”, “అఖండ” సినిమాలు కేవలం వసూళ్ల పరంగానే కాకుండా, బాలయ్య కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక ఇప్పుడు ఈ విజయాల తరువాత నాలుగోసారి కలసి చేస్తున్న సినిమా “అఖండ 2: తాండవం” కావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ప్రత్యేకంగా “అఖండ” ఇచ్చిన హిస్టారిక్ రన్ తరువాత ఈ సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగింది. బోయపాటి – బాలయ్య కాంబో అంటే మాస్ ఫ్యాన్స్ కి ఒక పండుగ వంటిదే. అందుకే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంత హైప్ ఉన్న సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇప్పటి వరకు సరిగ్గా జరగకపోవడం మాత్రం నందమూరి అభిమానులను కూడా నిరాశకు గురి చేస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేస్తారని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క సాంగ్ గాని, టీజర్ గాని బయటకు రాలేదు. కనీసం ఒక లుక్ రిలీజ్ చేసి హంగామా సృష్టిస్తారని అనుకున్న ఫ్యాన్స్‌కు ఇప్పటికీ నిరాశే ఎదురవుతోంది. ఫలితంగా, నిజంగా సినిమా సెప్టెంబర్‌లోనే వస్తుందా? లేక వాయిదా పడుతుందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
మేకర్స్ కూడా ఈ విషయంపై ఏ క్లారిటీ ఇవ్వకపోవడంతో వాయిదా అవుతుందనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంకో వారం గడిచిపోతే రిలీజ్ డేట్ కి కేవలం ఒక నెల మాత్రమే మిగులుతుంది. అలాంటప్పుడు, ఒక్క నెలలోనే ప్రమోషనల్ క్యాంపైన్ అంత గ్రాండ్గా ఎలా ? చేస్తారు ? అన్న సందేహాలు నందమూరి అభిమానుల్లో ఉన్నాయి. ఏదేమైనా “అఖండ 2: తాండవం”పై అభిమానుల్లో ఉన్న ఆత్రుతను మేకర్స్ కొంచెం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారనే అందరూ భావిస్తున్నారు.