
వైరల్ అవుతున్న న్యూస్ తన దృష్టికి రావడంతో అనసూయ భరద్వాజ్ ఈ న్యూస్ గురించి స్పందించడంతో పాటు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకటి రెండుసార్లు దెబ్బలు పడతాయి రాజా అని అన్నందుకే తాను ఫుల్ వైరల్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడితే మాత్రం అంతే సంగతులు అని అనసూయ భరద్వాజ్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
నేను బిగ్ బాస్ లో పాల్గొనేది లేదని అనసూయ భరద్వాజ్ అన్నారు. అనసూయ భరద్వాజ్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. తానూ ఫ్యామిలీని వదిలి అన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండటం అస్సలు సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొనే ఉద్దేశం అయితే తనకు లేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బుల్లితెర షోలకు అనసూయ భరద్వాజ్ దూరంగా ఉండగా ఆమె భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. అనసూయ కెరీర్ పరంగా మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు