
హరిణ్యా రెడ్డి మరెవరో కాదు, టిడిపి నేత, నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి కుమార్తె. ఈ వేడుకకు ఆయన కూడా హాజరై ఆశీర్వదించారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఫోటోలు నిన్నటి నుండి సోషల్ మీడియాలో విస్తారంగా షేర్ అవుతున్నాయి. అయితే రాహుల్ సిప్లిగంజ్ మాత్రం ఏటు ఫోటోలు షేర్ చేయలేదు. తాజాగా తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలు షేర్ చేస్తూ “నా న్యూ లైఫ్ బిగినింగ్స్” అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
ఇప్పటివరకు హరిణ్యా రెడ్డికి సంబంధించిన కొన్ని ట్రెడిషనల్ ఫోటోలు మాత్రమే వైరల్ అయ్యాయి. కానీ తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తన పర్సనల్ ఫోటోలు కూడా షేర్ చేశాడు. ముఖ్యంగా రాహుల్-హరిణ్యా రెడ్డి క్లోజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, రాహుల్ ఆమెకు నిశ్చితార్థపు ఉంగరం పెడుతున్న ఫోటోలు, అలాగే తన కాబోయే భార్యకు ముద్దు పెడుతున్న ఫోటోలు కూడా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. “మీ జంట ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలి, నిండు నూరేళ్లు కలసి ఉండాలి” అంటూ బ్లెస్సింగ్ కామెంట్స్ పెడుతున్నారు. “రాహుల్, హరిణ్యా రెడ్డికి ఎటువంటి దిష్టి తగలకూడదు” అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రాహుల్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి.