బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పటినుండి సిస్టర్ కి పెళ్లి చేసుకొని వెళ్లే వరకు ఇద్దరూ టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటారు. కానీ వన్స్ మ్యారేజ్ అయింది అంటే చాలు ఆ బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య చాలా మంచి బాండింగ్ ఉంటుంది. అప్పటివరకు టామ్ అండ్ జెర్రీ లా ఉన్న వీళ్లు ఆ తర్వాత ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత బాండింగ్ ఏర్పడుతుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా నాగార్జున కి సంబంధించి కొన్ని సీక్రెట్ విషయాలను జయమ్ము నిశ్చయమ్మురా షోలో నాగార్జున సోదరి నాగ సుశీల చెప్పిన ముచ్చట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.నాగ సుశీల నాగార్జున అమెరికాలో ఉండేటప్పుడు ఎలా ఉండేవాడో చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈ షోలో నాగార్జునని నువ్వు యుఎస్ లో ఉన్నప్పుడు చేసిన ఏదైనా చిలిపి పనులు చెప్పు అని జగ్గు భాయ్ అడగగా.. 

ఏమో నాకు ఇప్పుడు అవన్నీ గుర్తుకులేవు అంటూ నాగార్జున ఈ ప్రశ్న అను దాటవేసి ప్రయత్నం చేస్తాడు.కానీ పక్కనే ఉన్న నాగ సుశీల నేను చెబుతాను అంటూ ఎంట్రీ ఇచ్చి అప్పట్లో యూఎస్ లో ఉన్నప్పుడు నేను వారానికి ఒకసారి నాగ్ రూమ్ కి వెళ్లే దాన్ని.. నాగ్ ఆ రూంలో తన ఫ్రెండ్స్ తో కలిసి ఉండేవాడు.కానీ వాళ్ళందరూ ఆ రూమ్ ఎంత చెత్తగా ఉంచుకునే వారంటే చాలా దరిద్రంగా ఉండేది.ఎక్కడ తిన్న ప్లేట్లు అక్కడే..ఎక్కడ విడిచిన బట్టలు అక్కడే ఉండేవి.కనీసం ఏదైనా తిందామంటే కూడా స్పూను, ప్లేటు దొరికేది కావు. స్పూన్ కూడా సింక్ లో నుండి తీసుకొని కడుక్కొని మరీ తినాల్సి ఉండేది. అలా చాలా దరిద్రంగా రూముని ఉంచుకునేవారు. అంతేకాదు బాత్ టబ్ కూడా చాలా గలీజ్గా ఉంచేవారు నేనే వెళ్లి అన్ని క్లీన్ చేసే దాన్ని.ఇంట్లో ఉన్న చెత్తంతా క్లీన్ చేసి అంట్లు తోమి,ఇల్లు మొత్తం వుడ్చేసి, నీటుగా చేసి వచ్చేదాన్ని.

అలా ప్రతి వారం వెళ్లి ఆ పని చేసే దాన్ని అంటూ షాకింగ్ విషయం చెప్పింది.అయితే అక్క చెప్పిన మాటలకు నాగార్జున నువ్వు నేనేదో పెద్ద లెజెండ్ అని ఇక్కడ కూర్చో పెట్టావు. కానీ నా బ్యాడ్ హ్యాబిట్స్ మొత్తం చెప్పి నా పరువు తీస్తున్నావ్ అన్నట్లుగా మాట్లాడారు. దానికి జగపతిబాబు మరి ఈ షో అంటేనే అది కదా.. తెలియని విషయాలు కూడా బయట పెట్టాలి కదా అంటూ స్పందిస్తారు.అలాగే ఒకప్పుడు ఎంతో చెత్తగా తన రూమ్ ని ఉంచుకునే నాగార్జున ఇప్పుడు తన ఇంటిని మాత్రం చాలా శుభ్రంగా ఉంచుకున్నాడు. ఇంట్లో నేల కూడా అద్దంలా మెరుస్తుంది. అంత నీట్ గా ఉంటాడు. ప్రతి విషయంలో నీటినెస్ మెయింటైన్ చేస్తాడు. అలా ఉండే నాగార్జున ఇప్పుడు ఇలా తయారయ్యాడు అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది నాగ సుశీల.

మరింత సమాచారం తెలుసుకోండి: