
వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్లుగా ఇద్దరు టాప్ హోం బ్యూటీస్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వాళ్లు మరెవరో కాదు .. అందాల ముద్దుగుమ్మ చెన్నై బ్యూటీ "త్రిష". ఆమె ఇప్పటికే వెంకటేష్‌తో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా "ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే" సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ కెవ్వు కేక. ఆ తర్వాత "బాడీగార్డ్" సినిమాలో కూడా వీరి జంట ఆకట్టుకుంది. మళ్లీ ఇన్నాళ్లకి ఈ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
ఇక రెండో హీరోయిన్‌గా "హరిహర వీరమల్లు" సినిమా బ్యూటీ నిధి అగర్వాల్ ఎంపికైనట్లు టాక్. ఇద్దరూ హోమీ బ్యూటీస్, ఇద్దరూ వెంకటేష్ కటౌట్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం అంటేనే వేరు. హీరోయిన్స్ కి స్పెషల్ క్రేజ్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ సినిమా మరో లెవెల్‌లో ఉంటుందని, ఫుల్ క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అవుతుందని ఇప్పటికే టాక్ మొదలైంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం మరి త్రివిక్రమ్ ప్లాన్ ఎలా ఉంటుందో...??