తమిళ సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నటలలో తలపతి విజయ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుని కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఇలా స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న ఈయన తాజాగా ఓ రాజకీయ పార్టీని స్థాపించాడు. విజయ్ కొంత కాలం క్రితం తన పార్టీ పేరును , జెండాను కూడా ఆవిష్కరించాడు. విజయ్ తన పార్టీ కి తమిళగ వెట్రి కజగం అనే పేరును పెట్టాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ జన నాయగన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ నే తన చివరి సినిమా అని ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల్లోనే కొనసాగుతాను అని కూడా విజయ్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ అత్యంత భారీ ఎత్తున అనేక మంది జనాలతో ఓ భారీ సభను ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా విజయ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. తాజా సభలో భాగంగా విజయ్ మాట్లాడుతూ ... ఇప్పటి వరకు అనేక మంది సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చారు. అందులో చాలా మంది ఫెయిల్యూర్ అయ్యారు.

నేను కూడా ఫెయిల్యూర్ అవుతాను అని కొంత మంది మాట్లాడుతున్నారు. వారు వేరు నేను వేరు. నేను తటస్థంగా ఉంటాను. ఇది వరకు ఎంతో మంది సినీ తారలు చేయలేని పనులెన్నో నేను చేస్తాను. కచ్చితంగా ఈ సారి నేను సీ ఎం అవుతాను అనే స్థాయిలో ఆయన స్పీచ్ ఇచ్చాడు. ఇక ఈయన స్పీచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ చూసి ఆయన అభిమానులు కచ్చితంగా తమ అభిమాన నటుడు వచ్చే ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందుకొని ముఖ్యమంత్రి స్థానాన్ని చేరుకుంటాడు అని భావిస్తున్నారు. మరి విజయ్ సినిమాల్లో సక్సెస్ అయిన స్థాయిలో రాజకీయాల్లో కూడా అవుతాడా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: