సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి స్టార్ కూడా ఇలాంటి పరిస్థితిని ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఉంటారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ లాంటి బిగ్ హీరో కూడా ఇలాంటి సిచువేషన్‌ను ఫేస్ చేశారా అంటే..? అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. మనందరికీ తెలిసిందే, మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఒక హీరో మాత్రమే కాదు, ఇండస్ట్రీకి దక్కిన అరుదైన గౌరవం అని కూడా అంటారు. నేడు అటువంటి హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఆయన శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, మిగతా స్టార్స్ అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


అంతేకాదు, చిరంజీవికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా విషయంలో వేసిన రాంగ్ స్టెప్‌ని మరోసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి అంటే సినిమా కథ విన్న వెంటనే ఆ సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అని చెప్పగల టాలెంట్ ఉన్న స్టార్ అని అందరూ మాట్లాడుకుంటారు. అలాంటి చిరంజీవి తన కెరీర్‌లో ఒక సినిమా విషయంలో మాత్రం తప్పు చేశారు. ఒక సినిమాకు ఆయన కమిట్ అయి, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డారు కూడా. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఆ సినిమా మరేదో కాదు "మృగరాజు".



సిమ్రాన్, చిరంజీవి హీరో–హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ. ఈ సినిమా అభిమానులను ఎంటర్టైన్ చేస్తుందని చిరంజీవి ఆశపడ్డారు. కానీ ఆయన అనుకున్నట్లు ఈ సినిమా హిట్ కాలేదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మృగరాజు సినిమాను మెగా ఫ్యాన్స్ కూడా పెద్దగా ఎంకరేజ్ చేయలేకపోయారు. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం మెగాస్టార్ కెరీర్‌కు బాగా దెబ్బతీసింది. ఆ తర్వాత మెల్లగా ఫ్లాప్ షాక్ నుంచి బయటపడి తిరిగి విజయాలు అందుకున్నారు.న్ఈ సినిమా ఎప్పటికీ చిరంజీవి మర్చిపోలేనిది అని మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: