మెగాస్టార్ చిరంజీవి 70వ బర్తడే సందర్భంగా ఈ రోజున సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్లు వెలబడుతున్నాయి. ముఖ్యంగా ఆటు అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలకు కూడా చిరంజీవికి బర్తడే విశేష్ ని తెలియజేస్తున్నారు. నిన్నటి రోజున విశ్వంభర సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేయగా విశ్వంభర సినిమా  విడుదల తేదీని కూడా వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో గత కొంతకాలంగా ఒక సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ ని కూడా చిత్ర బృందం తాజాగా ఈ రోజున రివిల్ చేసింది.


చిరంజీవి 157వ సినిమా "మన శంకరవరప్రసాద్ గారు" అనే టైటిల్ తో గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. ముఖ్యంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి  సినిమాలు అంటే కచ్చితంగా ఫ్యామిలీ కామెడీ జోనర్ చిత్రాలని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా కూడా అలాగే ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ విషయానికి వస్తే.. చిరంజీవి వింటేజ్ లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అలాగే గ్యాంగ్ లీడర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సిగరెట్ తాగుతూ ఎంట్రీ ఇచ్చిన సీన్ హైలైట్ గా కనిపిస్తోంది.


అలాగే గన్ పట్టుకొని నడుస్తూ వస్తూ ఉండగా మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా కనిపిస్తోంది.చివరిలో చిరంజీవి గుర్రాన్ని పట్టుకొని మరి చాలా స్టైలిష్ గా కనిపించారు. ఈ గ్లింప్స్ చూస్తూ ఉంటే ఈసారి చిరంజీవి పక్కా కమర్షియల్ హిట్టు అందుకునేలా కనిపిస్తోందని అభిమానులతో పాటు నేటిజన్స్ కూడా తెలుపుతున్నారు. ఈ సినిమా పైన కూడా చిరంజీవి ప్రత్యేకించి మరి శ్రద్ధ పెట్టినట్లుగా కనిపిస్తోంది. అలాగే ఇందులో భారీ తారాగణం నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: