మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా "విశ్వంభర" చిత్ర బృందం ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌ల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సోషల్-ఫాంటసీ సినిమా, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రం, వంశీ, ప్రమోద్‌ల నిర్మాణంలో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్‌లో ఒక చిన్నారి, వృద్ధుడి మధ్య జరిగే సంభాషణతో కథా నేపథ్యం ఆవిష్కృతమైంది. స్వార్థపూరిత నిర్ణయాల వల్ల ఏర్పడిన మహా విధ్వంసం తర్వాత, విశ్వంభర లోకానికి ఎదురు చూస్తున్న రక్షకుడు చివరికి అవతరించాడని వృద్ధుడు చెప్పడం చూపించారు. అదే చిరంజీవి చాలా ప‌వ‌ర్ ఫుల్ ఎంట్రీతో స్క్రీన్‌పై కనువిందు చేశారు. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి అద్భుతంగా ఆకట్టుకుంది. వశిష్ట దర్శకత్వ ప్రతిభ, విజన్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతీ ఫ్రేమ్‌లో చిరంజీవి యొక్క శక్తి, భావప్రకటనలు అభిమానుల్లో మాంచి జోష్ నింపుతున్నాయి.


ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ సెట్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కలల లోకంలా రూపుదిద్దిన విశ్వంభర యూనివర్స్ విజువల్ ఎఫెక్ట్స్‌తో కలిసి మాయాజాలాన్ని సృష్టిస్తోంది. సినిమాటోగ్రాఫర్ చిన్న కే. నాయుడు కెమెరా వర్క్ ఆ లోకాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. ఎంఎం కీరవాణి అందించిన నేపథ్య సంగీతం గ్లింప్స్‌కి అదనపు బలాన్నిచ్చింది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచాయి. "విశ్వంభర"లో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. మౌని రాయ్ ప్రత్యేక గీతంలో మెప్పించనున్నారు. సమ్మర్ 2026లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ చిత్రం, చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: