టాలీవుడ్ ఇండస్ట్రీ లో మీడియం రేంజ్ హీరోలలో అద్భుతమైన క్రేజ్ కలిగిన వారిలో నాని ఒకరు. నాని ఈ మధ్య కాలంలో నటించిన దాదాపు అన్ని సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంటూ అద్భుతమైన కలెక్షన్లను రాబడుతున్నాయి. దానితో నాని హీరో గా రూపొందిన సినిమాలు ఇప్పటి వరకే చాలానే 100 కోట్ల కలక్షన్లను వసూలు చేశాయి. మరి మీడియం రేంజ్ హీరోలలో 100 కోట్లు ఆ పైన కలక్షన్లను వసూలు చేసిన సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా రూపొందిన గీత గోవిందం  సినిమా 130 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మీడియం రేంజ్ హీరోలలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాత స్థానంలో నాని హీరో గా రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ మూవీ 120 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , ఆ తర్వాత స్థానంలో కూడా నాని హీరో గా రూపొందిన దసరా మూవీ 118 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలోనూ , ఆ తర్వాత స్థానంలో నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సినిమా 100.4 కోట్ల కలెక్షన్లతో 4 వ స్థానం లోనూ , ఆ తర్వాత నాని హీరో గా రూపొందిన ఈగ మూవీ 100 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానం లోనూ కొనసాగుతుంది.


ఇలా మీడియం రేంజ్ హీరోలలో 100 కోట్ల కలెక్షన్లను సాధించిన ఐదు సినిమాలలో నాలుగు సినిమాలు కూడా నాని వే ఉన్నాయి. కానీ మొదటి స్థానంలో మాత్రం విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం ఉంది. ఇకపోతే ప్రస్తుతం నాని , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ తో నాని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: