కొంతమంది సెలబ్రిటీలను చూస్తే వీళ్ళ వయసు పెరుగుతుందా లేక తగ్గుతుందా అన్న అనుమానం రాక మానదు. అందాల భామ వేదిక ఇందుకు మంచి ఉదాహరణ. 40కి చేరువవుతున్న పాతికేళ్ల పడుచు పిల్లలా తన సొగసులతో ఎప్ప‌టిక‌ప్పుడు మెస్మరైస్ చేస్తుంటుందీ బ్యూటీ. వైట్ స్కిన్ టోన్‌, మల్లె తీగ లాంటి నడుము, కుర్రాళ్ల‌ను వెర్రెక్కించే ఫిజిక్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను హీటెక్కిస్తుంటుంది.
తాజాగా బిగినిలో మంటలు రేపింది. ఆరెంజ్ కలర్ బికినీలో గాగుల్స్ పెట్టుకొని స్విమ్మింగ్ పూల్ లోకి వయ్యారంగా దిగుతూ ఫోటోల‌కు పోజులిచ్చింది. మ‌త్తెక్కించే అందాల‌తో మంచి ట్రీట్ ఇచ్చింది. వేదిక చీర‌లో క‌న‌ప‌డితేనే త‌ట్టుకోలేని కుర్రాళ్లు.. బికినీలో ద‌ర్శ‌న‌మిస్తే ఆగుతారా? మెట‌లెక్కిపోతున్నారు. వేదిక అందాల‌ను ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.
అయితే ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అందం, అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. లేదంటే కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతుంది. వేదిక ప‌రిస్థితీ అదే. ఎంత గ్లామ‌ర్ ఉన్నా ఈ బ్యూటీకి సినిమా ఛాన్సులు అడ‌పా త‌డ‌పా అన్న‌ట్లుగానే వ‌స్తున్నాయి. 2006లో కెరీర్ ప్రారంభించిన వేద‌క.. త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, తెలుగు, హిందీ భాష‌ల్లో సినిమాలు చేసింది. టాలీవుడ్ లో క‌ళ్యాణ్ రామ్, బాల‌కృష్ణ‌, నారా రోహిత్ వంటి హీరోల‌తో తెర పంచుకుంది. కానీ ఏ ఇండ‌స్ట్రీలోనూ స్టార్ స్టేట‌స్ అందుకోలేక‌పోయింది. సినిమాల ద్వారా క‌న్నా అందాల ఆరబోతతోనే ఎక్కువ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న వేదిక‌.. ప్ర‌స్తుతం కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: