ఓరి దేవుడా..! నిజంగానే రాజమౌళి ఇలాంటి స్ట్రాంగ్ మూవ్ ప్లాన్ చేస్తున్నాడా..? మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన సినిమా గురించి ప్రతి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతుంది. అభిమానులు అయితే ఒక్కో న్యూస్‌ని రాకెట్ స్పీడ్‌తో వైరల్ చేస్తున్నారు. తాజాగా బయటకు వచ్చిన ఓ వార్త సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌లోకి నెట్టేసింది. సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో హీరో క్యారెక్టర్‌ని చాలా హై లో చూపిస్తూ.. ఆ హీరోనే సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలిపేలా డైరెక్ట్ చేస్తాడు. కానీ ఈసారి మాత్రం పూర్తిగా భిన్నంగా ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది.

లీకైన సమాచారం ప్రకారం .. రాజమౌళి రూపొందిస్తున్న ఈ మహేశ్ బాబు సినిమా ఓ కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. అందులో మహేశ్ బాబు పోషిస్తున్న సీనియర్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లోనే చనిపోతుందని అంటున్నారు. ఆ తర్వాత యంగ్ హీరోగా మరో మహేశ్ బాబు ( యువ మహేశ్ రూపం) ఎంట్రీ ఇచ్చి కథని ముందుకు తీసుకెళ్తాడట. అంటే సినిమాలో సీనియర్ మహేశ్ బాబు పాత్ర ఒక శక్తివంతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసి, తర్వాత ఆ ఇంపాక్ట్‌ని కొనసాగించే పని యంగ్ మహేశ్ బాబు క్యారెక్టర్ చేసేలా రాజమౌళి స్క్రీన్‌ప్లే రెడీ చేశాడట. ఈ ప్లానింగ్ కొంచెం రిస్కీగా అనిపించినా .. రాజమౌళి చేతిలో అది మాస్టర్ స్ట్రోక్‌గా మారే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆయన టేకింగ్, విజన్, నేరేషన్ స్టైల్ వల్ల రిస్క్ అనే పదమే మిగలదు. ప్రతి సీన్‌ని హైలైట్‌గా మార్చగలిగే మాయాజాలం రాజమౌళి దగ్గరే ఉంటుంది.

కానీ అసలైన ప్రశ్న ఏమిటంటే .. మహేశ్ బాబు క్యారెక్టర్ చనిపోయిన తర్వాత యంగ్ హీరో మహేశ్ బాబు ఎంతవరకు కనెక్ట్ అవుతాడు..? ఆయనపై ప్రేక్షకుల అటెన్షన్ మొత్తం నిలుస్తుందా..? అనేది బిగ్ సస్పెన్స్. ఇది మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు క్లారిటీ రాదు. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయి అభిమానుల్లో భారీ ఎక్సైట్మెంట్‌ని రేపుతోంది. మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఒక రిస్కీ కాన్సెప్ట్ అయినా, అదే టైమ్‌లో ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక కొత్త ప్రయోగం కావొచ్చని అనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: