
ఇది సాధారణ యాక్షన్ కథ కాదు, కొత్త కాన్సెప్ట్‌తో కూడిన సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ అని సమాచారం. మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని గోపీచంద్ స్పెషల్ ఎలిమెంట్స్‌తో యాక్షన్ పీక్స్‌లోనే కథ నడిపేలా డిజైన్ చేశారట. బాలయ్య అభిమానులను మరింత ఉత్సాహపరిచే మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయంలోనే కనబడబోతున్నారని టాక్. అంటే అఖండ 2లో డబుల్ యాక్షన్ ఎంజాయ్ చేయబోతున్న నందమూరి ఫ్యాన్స్, గోపీచంద్ సినిమాలో కూడా అదే మాస్ ట్రిప్‌ను ఆస్వాదించనున్నారు. ఇటీవలే గోపీచంద్ సోషల్ మీడియాలో "గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్" అని ఇచ్చిన హింట్‌కి ఇప్పుడు మరింత బలం చేకూరింది.
ఇక ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించనుండగా, ఇప్పటికే "ఈసారి బాలయ్య గర్జన మరింత ఘాటుగా ఉంటుంది… థియేటర్లు దద్దరిల్లిపోతాయి" అని ఫ్యాన్స్‌కి హైప్ ఇచ్చేశాడు. దీంతో బాలయ్య అభిమానులు డబుల్ కిక్‌లో మునిగిపోయారు. అఖండ 2 విజయంతో బాలయ్య రేంజ్ మరింత ఆకాశాన్నంటనుందని, ఆ క్రేజ్‌ను గోపీచంద్ మలినేని సరిగ్గా ఉపయోగించుకుంటూ, బాలయ్యను నెక్స్ట్ లెవల్ యాక్షన్ స్టార్గా ప్రెజెంట్ చేయబోతున్నాడని ఫిలింనగర్ టాక్. అలా సింహం 111వ సినిమా బాలయ్య కెరీర్‌లో మరో మైలురాయి కాబోతుందన్న నమ్మకంతో ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు.