ఈ మధ్య కాలంలో ఈ సెలబ్రిటీ విడాకులు సోషల్ మీడియాలో మెయిన్ మీడియా లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ జంట విడిపోతున్నారని తెగ వార్తలు వినిపించాయి. కానీ ఫైనల్ గా విడాకుల వార్తలకి క్లారిటీ వచ్చేసింది.మరి ఇంతకీ విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఆ జంట ఎవరు అనేది చూస్తే.. బాలీవుడ్ నటుడు గోవిందా సునీత ఆహుజా.. నటుడు గోవిందా షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో రెండో పెళ్లికి రెడీ అయ్యారంటూ ఎన్నో ట్రోల్స్ వినిపించాయి. 

అంతేకాదు గోవిందా తనకంటే వయసులో చాలా చిన్నదైనా ఓ మరాఠా హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారని ఈ విషయం తెలిసి సునీత ఆహుజా ఇంట్లో గొడవలు పెట్టి ముంబై ఫ్యామిలీ కోర్టు లో విడాకులకు అప్లై చేసినట్టు రూమర్లు వినిపించాయి. అలాగే వీరిద్దరూ పరస్పరం విడాకులు తీసుకోవడానికి అంగీకరించుకోవడంతో వీరి మధ్యలో ఉన్న ఒక లాయర్ కల్పించుకొని ఇద్దరికీ సర్ది చెప్పారంటూ రూమర్లు వినిపించాయి. అయితే విడాకులు తీసుకోకపోయినప్పటికీ ఇద్దరు వేర్వేరు ఇళ్ళలో విడిగా ఉంటున్నట్టు ఎన్నో రూమర్లు వినిపించాయి. అయితే ఫైనల్ గా ఈ విడాకుల వార్తలకు చెక్ పడింది.

తాజాగా సునీతా ఆహుజా, గోవిందా ఇద్దరు కలిసి గణేష్ చతుర్థి పూజలో జంటగా పాల్గొని విడాకుల వార్తలను కొట్టి పారేశారు. అంతేకాదు ఈ విడాకుల వార్తలపై సునీత ఆహుజా స్పందిస్తూ.. ఆ దేవుడే దిగివచ్చినా కూడా మమ్మల్ని విడదీయలేడు.. మేం నోరు విప్పి చెప్పే వరకు ఇలాంటి వార్తలను వైరల్ చేయకండి గోవిందా మనసులో భార్య స్థానం ఎప్పటికీ నాకే.. అంటూ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది సునీత. ప్రస్తుతం గోవింద సునీత ఇద్దరు కలిసి గణనాధుని పూజలో పాల్గొన్న ఫొటోస్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: