యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా..ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ ఓజి.. ఈ సినిమాపై హరిహర వీరమల్లు,ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రెండు సినిమాల కంటే ఎక్కువ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే విడుదలైన హరి హర వీరమల్లు సినిమా ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్.ఇమేజ్ కి తగ్గ సినిమా అనే టాక్ మాత్రం వినిపించలేదు.కానీ సెప్టెంబర్ 25న విడుదల కాబోతున్న ఓజి సినిమాపై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ రేంజ్ ని మరో లెవల్ కి తీసుకెళ్తుందని మాట్లాడుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించి వినాయక చతుర్థి రోజు "సువ్వి సువ్వి సువ్వాలా"అనే ఒక మంచి మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేశారు.

 అయితే ఈ మెలోడీ సాంగ్ చాలా బాగా ఆకట్టుకోవడంతో పాటు ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే జంటల ప్రీ వెడ్డింగ్ షూట్ లుకి,పెళ్లి వీడియోలకు ఈ పాట కరెక్ట్ గా సెట్ అవుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఈ నేపథ్యంలోనే కొంతమంది పవన్ కళ్యాణ్ అంటే పడని నెటిజెన్స్ పవన్ ప్రియాంక అరుల్ మోహన్ కలిసి చేసిన ఈ మెలోడీ సాంగ్ పై ట్రోల్స్ చేస్తున్నారు.50 ఏళ్ల ముసలోడు అంటూ చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ ప్రియాంక అరుల్ మోహన్ లపై ట్రోల్స్,మీమ్స్ చేస్తున్నారు.. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సువ్వి సువ్వి పాటకి ప్రేక్షకుల్లో భారీ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కొంతమంది కావాలనే ఈ పాటని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో ట్రోల్స్ చేస్తున్నారు. 

ఈ పాటలో ప్రియాంక అరుల్ మోహన్ పవన్ కళ్యాణ్ మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. కానీ ఈ కెమిస్ట్రీ సెట్ అవ్వలేదని,పవన్ కళ్యాణ్ అంకుల్ లా ఉంటే ప్రియాంక మోహన్ యంగ్ అమ్మాయిలా కనిపిస్తోందని,వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటూ ట్వీట్లు పెడుతున్నారు. ప్రియాంక మోహన్ పక్కన పవన్ కళ్యాణ్ అచ్చం అంకుల్ లా ఉన్నాడని వీరి జోడి అస్సలు సెట్ అవ్వలేదని,అలాగే సువ్వి సువ్వి మ్యూజిక్ కూడా అంత బాలేదని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: