ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం SSMB 29. దిగ్గజ దర్శకులు రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఈ చిత్రాన్ని సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్ తో దుర్గ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. కానీ ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన మహేష్ ముఖం కనిపించకుండా మెడలో లాకెట్ ను హైలెట్ చేస్తూ.. పోస్టర్ తో పాటు ఈ సినిమా అప్డేట్ పై క్లారిటీ ఇచ్చారు. నవంబర్లో ఎవరూ ఊహించని అప్డేట్ తో మీ ముందుకు తీసుకొస్తానని హామీ ఇచ్చారు రాజమౌళి.


షూటింగ్ విషయానికి వస్తే.. ఆఫ్రికన్ అడవులలో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఫుల్ లుక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో జరుగుతోంది. మహేష్ కి జోడిగా నటిస్తున్న ప్రియాంక చోప్రా కూడా సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. ముఖ్యంగా సినిమాలో ఇదే పెద్ద షెడ్యూల్ అన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు సౌత్ ఆఫ్రికా కంటే ముందే హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో SSMB 29 సినిమా కోసం ఒక భారీ సెట్ వేశారు. అయితే ఈ సెట్ మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ లోనే వేయడం గమనార్హం.


అంతా బాగానే ఉన్నా ఈ సినిమాకు సంబంధించిన మరొక వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే ఒక చెరువు సమీపంలో సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉండగా.. మహేష్ బాబు సున్నితత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలా సెట్ పూర్తి అయ్యాక మహేష్ బాబు షూటింగ్ కోసమని వెళ్లగా.. కేవలం ఒక అరగంట ఉండి తన వల్ల కాదంటూ షూటింగ్ నుంచి బయటికి వచ్చేసారట.. అలా రావడానికి కారణం వేడి తట్టుకోలేక చిరాకు పడి వచ్చేసారని సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అలా చివరికి ఆ షెడ్యూల్ మొత్తం ఆగిపోయిందని, దీంతో రూ.2 కోట్ల రూపాయలతో వేసిన ఈ సెట్ మొత్తం వృధా అయినట్లు సమాచారం.


రాజమౌళి అంటేనే హీరోలను ఏ విధంగా చూపిస్తారో చెప్పాల్సిన పనిలేదు. తనకు కావలసిన రీతిలోనే ఉపయోగించుకుంటారు. అందుకే చాలామంది రాజమౌళితో సినిమా చేసిన తర్వాత మళ్లీ ఆయనతో సినిమా అంటే దండం పెట్టేస్తుంటారు. ఇప్పుడు మహేష్ బాబు సున్నితంగా ఉండడం వల్ల ఎండలో సినిమా షూటింగ్ చేయలేకపోతున్నారని,  దీనివల్ల రాజమౌళి కష్టం అంతా కూడా వృధా అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: