
దాంతో, ఆ ఆఫర్ వచ్చినప్పుడల్లా ఆమె “నో, కుదరదు, చేయలేను, నాకు ఇష్టం లేదు” అంటూ రిజెక్ట్ చేసేసిందట. ఏకంగా మూడు సార్లు డైరెక్టర్ చెప్పినా వినకుండా, స్పష్టంగా తిరస్కరించిందని టాక్. అయితే ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది స్టార్ హీరో చిరంజీవి. ఆయన స్వయంగా అనుష్కతో మాట్లాడి, ఈ పాటను ఆమె తప్ప మరెవరూ చేయలేరని చెప్పి ఒప్పించారట. మెగాస్టార్ తనదైన స్టైల్లో చెప్పగానే, అనుష్క ఒక్క క్షణంలో మెల్ట్ అయి ఆ స్పెషల్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పేసిందట. ఆ పాట మరి ఏంటో అనుకుంటున్నారా? అదే స్టాలిన్ సినిమాలో వచ్చిన స్పెషల్ సాంగ్. ఈ సినిమాలో చిరంజీవి హీరో, త్రిష హీరోయిన్. అలాంటి బిగ్ మూవీ లో, అప్పుడిప్పుడే ఎదుగుతున్న అనుష్క కనిపించడంతో ప్రేక్షకులు మరింత ఎగ్జైటింగ్‌గా ఫీల్ అయ్యారు.
ఆ పాటలో అనుష్క తనదైన స్టైల్‌లో డాన్స్ చేస్తూ, సింపుల్‌గా, క్లీన్ పర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా, ఆమె డాన్స్‌లో ఎలాంటి వల్గారిటీ లేకుండా, ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ రాకుండా, కేవలం టాలెంట్‌తోనే ఇంప్రెస్ చేసింది. ఆ తర్వాత అనుష్క తన కెరీర్‌ని వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అరుంధతి వంటి సినిమాలతో ఇండస్ట్రీలో ఒక లెజెండరీ స్థాయికి చేరుకుని, అందరి చేత “జేజమ్మ” అని పిలిపించుకునే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం కూడా అనుష్క శెట్టి బిజీగా సినిమాలు చేస్తూ ఉంటున్నారు. ఆమె నటించిన తాజా సినిమా "ఘాటీ" రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ మూవీ కూడా బిగ్ బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఒకప్పుడు “నో, చేయలేను” అన్న అనుష్కను, మెగాస్టార్ చిరంజీవి ఒప్పించి, స్టేజీపైకి తెచ్చిన ఆ చిన్న ప్రయత్నమే, ఆమె కెరీర్‌కి కొత్త దారి చూపింది అని చెప్పాలి.