టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . నాగార్జున చాలా సంవత్సరాల క్రితం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాల ను ఎన్నింటి నో అందుకొని ఇప్పటికి కూడా తెలుగు సినీ పరిశ్రమ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరో ల్లో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు . ఇకపోతే మన తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తు న్న వారిలో నాగార్జునతో పా టు చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ కూడా ఉంటారు. ఈ ముగ్గురి తో పోలిస్తే ఒక విషయంలో నాగార్జున చాలా ముందు వరుస లో ఉన్నాడు.

అది ఎందులో అనుకుంటున్నారా ..? హీరో పాత్రల్లో మాత్రమే కాకుండా ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో నటించే విషయంలో. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ వీరు ముగ్గురు కూడా చాలా శాతం వరకు సినిమాల్లో హీరో పాత్రల్లోనే నటిస్తున్నారు. ఇతర హీరోల్లో చిన్న క్యామియో పాత్రలలో మిరహాయిస్తే పెద్ద పాత్రల్లో నటించడం లేదు. ఇక నాగార్జున మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. నాగార్జున కొంత కాలం క్రితం హిందీ సినిమా అయినటువంటి బ్రహ్మాస్త్ర లో కీలక పాత్రలో నటించాడు.

అలాగే కుబేర సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి మెప్పించాడు. తాజాగా కూలీ సినిమాలో నాగార్జున ఏకంగా విలన్ పాత్రలో నటించాడు. నాగార్జున విలన్ పాత్రకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలా నాగార్జున టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఎవరు చేయని విధంగా సినిమాల్లో కీలక పాత్రల్లో , విలన్ పాత్రలోలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: