తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోగా, నిర్మాతగా పేరు సంపాదించిన విశాల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. విశాల్ ఎవరో కాదు ప్రముఖ నిర్మాత జి.కే రెడ్డి చిన్న కుమారుడే. మొదటిసారి ప్రేమ చదరంగం అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. పందెం కోడి చిత్రంతో స్టార్ హీరోగా పేరు సంపాదించిన విశాల్ తన చిత్రాలను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ ఉంటారు. అలా పొగరు , డిటెక్టివ్,పూజా, సెల్యూట్, మార్క్ ఆంటోని తదితర చిత్రాలలో నటించారు.



గత కొంతకాలంగా విశాల్ పెళ్లి పైన పలు రకాల రూమర్స్ వినిపించాయి. కానీ ఎట్టకేలకు తమిళ నటి సాయి ధన్సికతో  ప్రేమలో ఉన్నాననే విషయాన్ని సినిమా ఈవెంట్లో స్టేజ్ మీదే ప్రకటించారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటినుంచి విశాల్ పెళ్లి గురించి పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.  తాజాగా ఈ రోజున విశాల్, ధన్సిక ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు కొన్ని ఫోటోలను విశాల్ షేర్ చేయగా ఈ జంటకు సిని సెలెబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు .అయితే విశాల్ ఈరోజే ప్రత్యేకించి ఎంగేజ్మెంట్ చేసుకోవడం వెనుక ఒక కారణం ఉన్నట్లు తెలుస్తోంది.


అదేమిటంటే హీరో విశాల్ పుట్టినరోజు  ఈరోజు కావడం చేత తన ఎంగేజ్మెంట్ ని కూడా ఈరోజు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎంగేజ్మెంట్ కి కొంతమంది కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రుల సమక్షంలో చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈరోజు తనకు చాలా ప్రత్యేకమైన రోజు తన పుట్టినరోజు సందర్భంగా తమ జంటని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు ధన్సిక తో జరిగిన నా నిశ్చితార్థం  గురించి మా కుటుంబ సభ్యులు మీ అందరితో పంచుకోవడం కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తోంది.. ఎప్పటిలాగే మీ ప్రేమ, అభిమానాలు తమ పైన ఉంచాలని కోరుకుంటున్నాను అంటూ హీరో విశాల్ ఒక పోస్ట్ షేర్ చేశారు. ధన్సిక  కూడా పలు చిత్రాలలో హీరోయిన్గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: