‘బలగం’ సినిమాతో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు వేణు యెల్దండి కొత్త సినిమా అనగానే ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది. ఆ టైటిల్‌ కూడా అదిరిపోయేలా ఉంది – “ఎల్లమ్మ”. పల్లెటూరు వాతావరణంలో, గ్రామీణ అంచుల్లో జరుగబోయే భావోద్వేగ కధనం అని టాక్ వచ్చింది. మొదట ఈ ప్రాజెక్ట్ హీరోగా నితిన్ని ఫిక్స్ చేసినట్టు అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయ్యారు. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ 70 కోట్లు దాటుతుందని టాక్. అంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే నిర్మాత దిల్ రాజు మాత్రం రిస్క్ చేయడానికి సిద్ధంగా లేడట. నితిన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని 70 కోట్ల భారీ బడ్జెట్ సేఫ్ కాదని భావించి, పాన్ ఇండియా లెవెల్ హీరోని రప్పించాలన్న ఆలోచన మొదలుపెట్టారట. ఇందులో భాగంగా తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్ ఉన్న కార్తీ పేరే హైప్‌లోకి వచ్చింది.

కార్తీకి సౌత్‌లో అన్ని వర్గాల్లోనూ బలమైన క్రేజ్ ఉంది. రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాల్లో ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. “కైతి”, “సుల్తాన్”, “విరుమాన్” వంటి సినిమాల తర్వాత ఆయనకు గ్రామీణ డ్రామాపై ప్రత్యేకమైన హోల్డ్ ఏర్పడింది. అలాంటప్పుడు “ఎల్లమ్మ” లాంటి పల్లెటూరు ఎమోషనల్ కథకు కార్తీనే బెస్ట్ ఆప్షన్ అన్న అభిప్రాయంలో దిల్ రాజు ఉన్నారని ఫిలింనగర్ టాక్. మరి కథానాయికగా ఎవరు? – ఈ విషయంలో కూడా పెద్ద చర్చే నడుస్తోంది. సాయిపల్లవికీర్తి సురేష్ పేర్లు రౌండ్ అవుతున్నాయి. గ్రామీణ కథల్లో సాయిపల్లవి ఎమోషనల్ కనెక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. మరోవైపు కీర్తి సురేష్‌కూ మంచి న్యాచురల్ యాక్టింగ్, ఇన్నోసెంట్ లుక్స్ అన్నీ కలిపి పర్ఫెక్ట్ సెట్ అవుతాయి. ఈ ఇద్దరిలో ఎవరు “ఎల్లమ్మ” లో హీరోయిన్ అవుతారో చూడాలి.

ఇక దర్శకుడు వేణు యెల్దండి మీదే పెద్ద అంచనాలు ఉన్నాయి. ‘బలగం’తో బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, ప్రతి ఇంట్లోనూ సెన్సేషన్ సృష్టించాడు. ఇప్పుడు అంతకు మించి ఎమోషనల్, కల్చరల్ కనెక్ట్ ఉన్న “ఎల్లమ్మ” లాంటి కథను ఎలా ప్రెజెంట్ చేస్తాడన్నది హాట్ టాపిక్. మొత్తానికి – నితిన్ పేరు ప్రకటించి , ఇప్పుడు కార్తీ వైపు మలుపు తిప్పడం ఫిలింనగర్ చర్చల్లో హాట్ బజ్‌గా మారింది. త్వరలో అధికారిక ప్రకటన రానున్నప్పటికీ, ఒక్క టైటిల్‌తోనే “ఎల్లమ్మ” సినిమా బజ్ పెంచేసింది. ఒకవేళ కార్తీ – సాయిపల్లవి/కీర్తి కాంబినేషన్ కన్‌ఫర్మ్ అయితే, ఈ సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హడావుడి చేయడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: