
ప్రస్తుతం వెంకటేష్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరు కలిసి పని చేసినప్పటికీ ఆ సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా పని చేశారు. త్రివిక్రమ్ తనదైన శైలిలో కథను నడిపించడంలో దిట్ట. వెంకటేష్ నటనకు త్రివిక్రమ్ దర్శకత్వం తోడైతే, అది బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాబోయే రోజుల్లో వెంకటేష్ మరిన్ని స్టార్ డైరెక్టర్ల చిత్రాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. వెంకటేష్‌లోని విభిన్నమైన నటన, ఆయనకున్న క్రేజ్, స్టార్ డైరెక్టర్ల టెక్నికల్ స్కిల్స్ కలిస్తే, అది సినిమాకు తిరుగులేని విజయాన్ని అందిస్తుందని అందరూ భావిస్తున్నారు. వెంకటేష్ గత కొన్నేళ్లుగా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈయన ప్రయాణం ఇలాగే కొనసాగితే, ఆయనకు తిరుగుండదు. ఆయన చేసే ప్రతి సినిమా కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని విశ్లేషకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు