కోలీవుడ్‌ హీరో, నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ ఎట్ట‌కేల‌కు ఓ ఇంటివాడు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ హీరోయిన్ సాయి ధన్సికతో దాదాపు 9 ఏళ్ల నుంచి రిలేష‌న్‌లో ఉన్న విశాల్‌.. ఇప్పుడు ఆమెతోనే ఏడ‌డుగులు వేయ‌డానికి రెడీ అయ్యారు. వీరి వివాహ నిశ్చితార్థం ఆగ‌స్టు 29న చెన్నైలో జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే ఈ వేడుక‌లో పాల్గొన్నారు. తమ నిశ్చితార్థ ఫోటోలను విశాల్ సోష‌ల్ మీడియా వేదికగా పంచుకున్నారు.


`నడిగర్‌ సంఘం` బిల్డింగ్‌ పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని విశాల్ నిర్ణయించుకున్నాడు. అందుకు ధ‌న్సిక కూడా అంగీక‌రించింది. అయితే మరో 2 నెలల్లో బిల్డింగ్ కంప్లీట్‌గా సిద్థమవుతుంది. అందులోనే విశాల్‌, ధ‌న్సిక‌ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్ప‌టికే ఆడిటోరియం కూడా బుక్‌ చేసుకున్నారు. భవనం ప్రారంభోత్సవం జరిగిన వెంటనే విశాల్‌, ధ‌న్సిక‌ల వెడ్డింగ్ డేట్ ను ఖ‌రారు చేయ‌నున్నార‌ని స‌మాచారం.


ఇక రీసెంట్‌గా నిశ్చితార్థం జ‌రిగిన నేప‌థ్యంలో మ‌రోసారి విశాల్‌, ధ‌న్సిక‌ల మ‌ధ్య ఏజ్ గ్యాప్ నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌య‌సులో ధ‌న్సిక కంటే విశాల్ చాలా పెద్ద‌వాడు. విశాల్ 1977 ఆగ‌స్టు 29న జ‌న్మించ‌గా.. ధ‌న్సిక 1989 న‌వంబ‌ర్ 20న జ‌న్మించింది. విశాల్ ప్రస్తుతం 48 ఏళ్ల వయసులో ఉండగా, ధన్సిక 35 ఏళ్ల వయసులో ఉంది. అంటే సుమారు 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. అయితే ప్రేమకు వయసు అడ్డంకి కాదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. వయసు తేడా ఉన్నా, ఇద్దరి మధ్య అర్ధం చేసుకోవడం, కేర్, బాండింగ్ బలంగా ఉండటమే వారి రిలేషన్‌ను ముందుకు తీసుకువెళ్తోంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: