
హీరో విజయరామరాజు మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఆరు సంవత్సరాల కష్టానికి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా అనిపించింది. మాకు సపోర్ట్ చేసిన హనురాఘవపూడి గారికి, వెట్రిమారన్ గారికి, అడివి శేష్ గారికి, సంపత్ నంది గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాను చూసిన ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సినిమాలో నేను ఏదైనా పెర్ఫార్మన్స్ చేశాను అంటే ఆ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారికి దక్కుతుంది. మా నిర్మాత శ్రీని గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన లేకపోతే ఈ సినిమా వచ్చేది కాదు. నేను ఎంత కష్టపడినా మా వెనక ఉండి ఒక కొండంత ధైర్యంతో నడిపించారు. ఒక సినిమా ప్రేక్షకులు ముందుకు తీసుకు రావడానికి ఎంత కష్టపడాలో అందరికీ తెలుసు. ఆరేళ్లుగా మా నిర్మాత ఈ సినిమా బరువుని మోసారు. ఆయన ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఆయన జీవితాంతం నా గుండెల్లో ఉంటారు. ఈ సినిమాకి మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. చూసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా చూడండి. చాలా మంచి సినిమా చూసామనే అనుభూతి కలుగుతుంది.
హీరోయిన్ సిజా రోజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమాతో తెలుగులోకి రావడం చాలా ఆనందంగా ఉంది. నా తొలి తెలుగు సినిమా ఇంత మంచి అద్భుతమైన రివ్యూస్ తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. దేవిక పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. నిర్మాత శ్రీని గారు ఈ సినిమాని గ్రేట్ విజన్ తో నిర్మించారు. విజయ్ గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా థియేటర్స్ లో చూసి ఇంకా పెద్ద విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను.
నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకి వచ్చిన రివ్యూస్, మేము ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన సర్వే ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యాయి. ఇంత అద్భుతమైన స్పందన ఇచ్చిన మీడియా మిత్రులకు నమస్కరిస్తున్నాను. యుఎస్ లో ఇండియాలో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్టర్ దయానంద్ రెడ్డి మాట్లాడుతూ... అందరికి నమస్కారం. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని చెప్తున్నారు. దాదాపు వంద సినిమాలు చేశాను. అన్ని సినిమాల్లో కల్లా ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. ఇందులో రంగయ్య క్యారెక్టర్ నా కెరియర్ లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమాని, ఈ క్యారెక్టర్ అద్భుతంగా మలిచిన డైరెక్టర్ గారికి, పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ థాంక్ యూ మీట్ లో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.