
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, స్వయంగా రామ్ చరణ్ ఈ రోజు తన సోషల్ మీడియా హ్యాండిల్‌లోనే “పెద్ది” ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. “మాస్ట్రో ఏ.ఆర్. రెహ్మాన్ మాయాజాలంతో ‘పెద్ది’ని ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఆవిష్కరించారు. మా ఫస్ట్ సింగిల్ త్వరలోనే మీ ముందుకు రాబోతోంది” అంటూ ట్వీట్ చేశారు చరణ్. దీంతో అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.చాలా కాలం తర్వాత ఏ.ఆర్. రెహ్మాన్ తెలుగులో చేస్తున్న సినిమా ఇదే. ఇప్పటికే “పెద్ది గ్లింప్స్”లో ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉండటంతో, ఫ్యాన్స్‌లో పెద్ది ఆల్బమ్ పై అంచనాలు మరింత ఎక్కేశాయి. ఫస్ట్ సింగిల్ విడుదలైతే యూత్, ఫ్యాన్స్ మధ్య ఊహించని స్థాయిలో వైరల్ అవ్వడం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.
ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా రామ్ చరణ్ సరసన నటిస్తోంది. అదేవిధంగా శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బుచ్చిబాబు రాసిన కథ, రామ్ చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, రెహ్మాన్ మ్యూజికల్ మాజిక్ – ఈ మూడూ కలిస్తే “పెద్ది”ని ఎలాంటి రేంజ్‌లోకి తీసుకెళ్తాయో ఇప్పుడే ఊహించలేము.మేకర్స్ ఇప్పటికే మార్చి 27, 2026న సినిమా విడుదల తేదీని లాక్ చేశారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేయబోతున్నారు. మెగా అభిమానులు, సినిమా ప్రేక్షకులు అందరూ “పెద్ది” ఫస్ట్ సాంగ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. “పెద్ది” సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ మైల్స్‌టోన్ అవ్వడం ఖాయం అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.