సినిమా ఇండస్ట్రీ లో స్టార్ ఈమేజ్ కరిగిన హీరోలు నటించిన సినిమాలకు పెద్దగా ప్రమోషన్లు అవసరం ఉండవు. ఎందుకు అంటే ఒక స్టార్ హీరో సినిమాలో నటించాడు అంటే దానిపై మొదటి నుండి ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఆ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను విడుదల చేస్తే అవి కాస్త బాగున్న కూడా సినిమాపై అంచనాలు పెరుగుతూ ఉంటాయి. దానితో స్టార్ హీరోలు ప్రత్యేకంగా సినిమాను ప్రమోట్ చేయడానికి బయటికి వచ్చి ఇంటర్వ్యూలు చేయాల్సిన అవసరం ఉండదు. అదే చిన్న సినిమాలను ప్రమోట్ చేయనట్లయితే ఆ మూవీపై పెద్దగా బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉండవు.

ఇక సినిమా ఇండస్ట్రీలో అత్యంత తక్కువ మంది హీరోయిన్లకు మాత్రమే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉంటుంది. వారు నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలకు వారు బయటకు వచ్చి ప్రమోషన్లు చేయకపోయినా అద్భుతమైన క్రేజ్ సినిమాపై ఏర్పడుతూ ఉంటుంది. ఇకపోతే అంతటి క్రేజ్ కలిగిన నటీ మణులలో అనుష్క శెట్టి ఒకరు. ఈమె నటిగా కెరియర్ను మొదలు పెట్టిన ప్రారంభంలో చాలా కమర్షియల్ సినిమాలలో నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మధ్య కాలంలో అనుష్క ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో , తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ వస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఘాటి అనే సినిమాలో నటించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ప్రమోషన్లలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కానీ అనుష్క మాత్రం ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం లేదు. అయినా కూడా అనుష్క నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: