సినిమా ఇండస్ట్రీ లో ఓ కాంబోలో అనేక సినిమాలు మిస్ అయిన సందర్భాలు చాలానే ఉంటాయి. ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో కొంత కాలం క్రితం స్పైడర్ అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. మహేష్ బాబు , మురగదాస్ కాంబోలో వచ్చిన ఒకే ఒక్క సినిమా అయినటువంటి స్పైడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. కానీ వీరి కాంబోలో ఈ సినిమా కంటే ముందు రెండు సినిమాలు మిస్ అయ్యాయి. ఆ సినిమాలు మాత్రం అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. మరి మహేష్ బాబు , మురుగదాస్ కాంబోలో మిస్ అయిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం ఏ ఆర్ మురుగదాస్ , సూర్య హీరోగా ఆసిన్ , నయనతార హీరోయిన్లుగా గజిని అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను మొదట మురుగదాస్ , సూర్య తో కాకుండా మహేష్ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనకు కథను కూడా వినిపించాడట. కానీ మహేష్ ఆ కథ తనకు సూట్ కాదు అని రిజెక్ట్ చేశాడట. ఇక మురుగదాస్ కొన్ని సంవత్సరాల క్రితం తలపతి విజయ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తుపాకీ అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని కూడా మురగదాస్ మొదట విజయ్ తో కాకుండా మహేష్ తో చేయాలి అని అనుకున్నాడట. కానీ మహేష్ కొన్ని కారణాలతో ఈ సినిమా చేయలేను అని చెప్పాడట. ఇలా మహేష్ , మురగదాస్ కాంబోలో గజిని , తుపాకి సినిమాలు మిస్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: