
2012లో బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. అక్కడ కూడా వరుస పెట్టి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఎక్కువ కాలం స్టార్డమ్ కాపాడుకోలేకపోయింది. అయితే కొంత కాలం నుంచి ఇలియానా సినిమాలకు దూరంగా ఉంటోంది. 2003లో ఈ అమ్ముడు తన ప్రియసఖుడు మైఖేల్ డోలన్ ను గప్‌చుప్‌గా వివాహం చేసుకుంది. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్‌లోనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది.
ప్రస్తుతానికి ఇలియానా పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌లో బిజీగా ఉంది. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో తన కుమారులతో ఉన్న ఫొటోలు, హ్యాపీ మూమెంట్స్‌ని షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా తన రీఎంట్రీపై ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
`రీఎంట్రీ ఇవ్వడానికి తొందర పడడం లేదు. కానీ మరోసారి ఆడియెన్స్‌ను అలరించేందుకు మాత్రం రెడీగా ఉన్నాను. ఫ్యాన్స్ నన్ను ఎంత మిస్ అవుతున్నారో అర్థం చేసుకోగలను. నేను కూడా సిల్వర్ స్క్రిన్‌పై కనిపించడం, భిన్నమైన పాత్రలను పోషించడం, సెట్లో ఉండే సందడిని చాలా మిస్ అవుతున్నా. కాకపోతే ప్రస్తుతం నేను నా పిల్లల బాధ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. అందుకే విరామం తీసుకున్నా. కొద్ది రోజులు తర్వాత తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వస్తా, నా యాక్టింగ్ కెరీర్‌ను కంటిన్యూ చేస్తా` అంటూ ఇలియానా చెప్పుకొచ్చింది. మొత్తానికి సినిమాలను ఎంత మిస్ అవుతున్నా కూడా పిల్లల కారణంగానే నటనకు దూరంగా ఉండాల్సి వస్తుందని ఇలియానా స్పష్టం చేసింది.