సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన నటీ నటులు సినిమాల్లో నటించి డబ్బులు సంపాదించడం మాత్రమే కాకుండా కొన్ని బిజినెస్ లలోకి కూడా ఎంట్రీ ఇచ్చి పెద్ద స్థాయిలో డబ్బులను సంపాదిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. నటీ నటులు సినిమా ఇండస్ట్రీ కి సంబంధం ఉన్న బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పటికే చాలా మంది నటీ నటులు థియేటర్ బిజినెస్ లలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా మన తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు అయినటువంటి మహేష్ బాబు ఇప్పటికే థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే మరి కొంత మంది స్టార్ హీరోలు కూడా ఇప్పటికే థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది హీరోలు అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయ్యారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఎక్కువ శాతం మన టాలీవుడ్ స్టార్ హీరోలతో ఏసియన్ సంస్థ వారు థియేటర్ బిజినెస్ను కొనసాగిస్తున్నారు. ఇక ఏషియన్ సంస్థ వారు రామ్ చరణ్ తో కలిసి ఓ థియేటర్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ప్రస్తుతం ఏషియన్ సంస్థ వారు రామ్ చరణ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి రామ్ చరణ్ కూడా చాలా మంది టాలీవుడ్ స్టార్ హీరోలో మాదిరి ఏషియన్ సంస్థతో కలిసి థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తాడా ... లేదా అనేది చూడాలి. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: