సినిమా ఇండస్ట్రీ లో ఒక నటుడికి ఒక జోనర్ సినిమాలతో పెద్దగా సక్సెస్ లు రావడం లేదు అన్న , అలాగే ఒకే జోనర్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న వారు ఆ జోనర్ నుండి పక్కకు రావాల్సి ఉంటుంది. లేక ఒకే జోనర్లో సినిమాలు చేసినట్లైతే ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టి ఆ హీరో సినిమాలకు వెళ్లే ఆలోచనను కూడా మానేస్తూ ఉంటారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో రామ్ పోతినేని ఒకరు. ఈయన గత కొంత కాలంగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లను చేస్తూ వెళ్తున్నాడు. ఈయనకు ఈ మధ్య కాలంలో చేసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లలో కేవలం ఇస్మార్ట్ శంకర్ మూవీ ద్వారా మాత్రమే విజయం వచ్చింది. ఆ తర్వాత ఈయనకు ఆ జోనర్ మూవీలతో చాలా వరకు అపజయాలు వచ్చాయి.

దానితో రామ్జోనర్ నుండి బయటకు రాకపోతే ఆయనకు హిట్లు రావడం కష్టం అని కూడా చాలా మంది అభిప్రాయ పడిన సందర్భాలు ఉన్నాయి. దానితో రామ్ కూడా వెంటనే యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ నుండి బయటకు వచ్చేసి ప్రస్తుతం మహేష్ బాబు పి దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలూకా అనే క్లాస్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా తర్వాత కూడా మళ్ళీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ల జోలికి వెళ్లకుండా మరో సరికొత్త జోనర్ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటివరకు రామ్ చేయని జోనర్ మూవీ ని తాజాగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా తర్వాత ఆర్కా మీడియా బ్యానర్ లో రామ్ ఒక హార్రర్ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా రామ్ డిఫరెంట్ డిఫరెంట్ జోనర్ మూవీలను ట్రై చేస్తూ వెళుతుండడంతో చాలా మంది రామ్ చాలా వరకు మారాడు. సూపర్ సాలిడ్ డెసిషన్లను తీసుకుంటున్నాడు అని అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: