50 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకోవడం లేదు.. దాంతో చాలామంది అసలు ఈ హీరోయిన్ పెళ్లి చేసుకోదా? ఎందుకు పెళ్లికి వ్యతిరేకంగా ఉంటుంది అని మాట్లాడుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసింది పవన్ కళ్యాణ్ బద్రి మూవీ హీరోయిన్ అమీషా పటేల్.. తాజాగా ఈ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను పెళ్లికి వ్యతిరేకిని కాదు..పెళ్లి చేసుకోవాలని చాలా సార్లు ప్రయత్నించాను. నాకంటే చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ పెళ్లి తర్వాత నన్ను మారమంటే మాత్రం నేను ఒప్పుకోను.

ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన చాలామంది పెళ్లయ్యాక నువ్వు సినిమాలు మానేయాలని చెప్పారు.కానీ వారి కోసం నా ప్రొఫెషన్ ని మార్చుకోవడం నాకు ఇష్టం లేదు.అందుకే పెళ్లయ్యాక కూడా నా ఆలోచనల పట్ల గౌరవం ఇచ్చే వాడిని నేను పెళ్లి చేసుకుంటాను. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించాను. కానీ ఆ వ్యక్తి ప్రేమించాక సినిమాల్లో కొనసాగకూడదు అలా అయితేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. కానీ ప్రేమ కోసం నా సినీ కెరీర్ ని వదులుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు.అందుకే అతడికి బ్రేకప్ చెప్పేసా. నా వయసులో సగం వయసు ఉన్న వాళ్ళు కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రపోజల్స్ పంపుతున్నారు.

కానీ పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదు అనే కండిషన్ పెట్టడం నాకు ఏ మాత్రం నచ్చడం లేదు.అందుకే పెళ్లికి దూరంగా ఉంటున్నా. పెళ్లి చేసుకోకూడదు అనే ఉద్దేశం నాకు లేదు. కానీ సరైన వ్యక్తి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. అంటూ అమీషా పటేల్ చెప్పుకొచ్చింది.ఇక అమీషా పటేల్ తెలుగులో ఎన్టీఆర్ తో నరసింహుడు,పవన్ కళ్యాణ్ తో బద్రి, బాలకృష్ణతో పరమ వీరచక్ర,మహేష్ బాబు తో నాని వంటి సినిమాల్లో నటించింది. ఇక ప్రస్తుతం తెలుగులో నటించడం లేదు కానీ బాలీవుడ్లో చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత గదర్ -2 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: