
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత( పిసిబి) అధికారులకు ఉన్నదని కానీ ఎవరి మాట వినడం లేదని.. పార్లమెంట్ సభ్యుడుగా అయోధ్య రామిరెడ్డికి చెందిన "రాంకీ "కంపెనీల పైన ఏదైనా చర్యలు తీసుకోవడానికి ఎందుకో వెనుకడుగు వేస్తున్నారని.. ఏమని ప్రశ్నిస్తే అందుకు సంబంధిత శాఖ పవన్ కళ్యాణ్ ని అడగాలని చెబుతున్నారని ఎమ్మెల్యే బోండా ఉమా సభ దృష్టికి తీసుకువెళ్లారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ పి కృష్ణయ్య పైన ఎమ్మెల్యే ఉమా ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఏదైనా పనికి సంబంధించి లెటర్లను పంపితే 30, 40 ఏళ్ల నుంచి ఇలాంటి ఎమ్మెల్యే లెటర్లను చాలానే చూసామంటూ మాట్లాడారని.. కానీ ఎమ్మెల్యేలు గెలిస్తేనే కృష్ణయ్య అక్కడ చైర్మన్ గా ఉన్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ హెచ్చరించారు.
కృష్ణయ్య దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ కు చెప్పాలని.. పవన్ కళ్యాణ్ ని కలవనివ్వడం లేదని చెబుతున్నారని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కృష్ణయ్య లాంటి వారిని సరిదిద్దాలంటూ ఎమ్మెల్యే ఉమా వ్యాఖ్యలు చేశారు.. ఈ విషయం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు (PCB) ఎవరిని నియమించలేదు మేము వచ్చాకే కృష్ణయ్యను తీసుకువచ్చాము.. తాను అందుబాటులో ఉండడం లేదనే వ్యాఖ్యలు సరిదిద్దుకోవాలి.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రజలతో కంటే ఎక్కువగా పరిశ్రమలతోనే సంబంధాలు కలిగి ఉంటుంది.. కృష్ణయ్య వంటి వారు చైర్మన్ అయ్యాకే ప్రజల అనుమానాలకు సమాధానాలు దొరుకుతున్నాయని.. పారిశ్రామికవేత్తలను భయపెట్టే విధంగా చర్యలు ఉండకూడదు.. రాంకీ సంస్థకు షోకేస్ నోటీసులు ఇచ్చి మరి చర్యలు తీసుకున్నాము.. తక్షణ చర్యలు తీసుకుంటే చాలా కుటుంబాలు రోడ్డున పడతాయని అందుకే సమగ్ర నివేదిక రూపంలో ఇస్తే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
అయితే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో కనిపిస్తున్నాయని వ్యక్తిగత ఉద్దేశాలతో లక్ష్యంగా చేసుకొని ఆయన మాట్లాడినట్లుగా అనిపిస్తోందని మాట్లాడారు. అసలు ఎమ్మెల్యే ఈ విధంగా ఎందుకు వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది అంటూ ఆరా తీస్తున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.