అప్పుడప్పుడు కొంతమంది నటీనటులు మాట్లాడే మాటలు వివాదంలో ఇరుక్కుంటూ ఉంటాయి. అలా తాజాగా కమల్ హాసన్ చేసిన కామెంట్లు కూడా వివాదాస్పదమయ్యాయి. ఈయన మాట్లాడిన మాటలు విన్న చాలామంది నెటిజెన్లు కమల్ హాసన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. మరి ఇంతకీ కమల్ హాసన్ మాట్లాడిన ఆ మాటలు ఏంటి..ఎందుకు ఆయనపై అంతలా నెగెటివిటీ వస్తుంది అనేది చూస్తే.. సనాతన ధర్మాన్ని నమ్మని వారిలో కమల్ హాసన్ కూడా ఒకరు.ఈయన దేవుళ్లను పురాణాలను అస్సలు నమ్మరు. అలా ఎప్పుడూ కూడా హిందుత్వం గురించి తక్కువ చేసి మాట్లాడుతూనే ఉంటారు. అయితే అలాంటి కమల్ హాసన్ తాజాగా మహాభారతం, రామాయణం లను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే కమల్ హాసన్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఆ వీడియోలో యాంకర్ ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకువచ్చినా కూడా ఆడవాళ్ళపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఆగడం లేదు.ఈ అత్యాచారాలు ఆగి ఆడవాళ్లకు రక్షణ దొరకాలంటే ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పండి మీ ఆలోచన ప్రకారం ఏం చేయాలి అన్నట్లుగా యాంకర్ ప్రశ్నించింది. అయితే యాంకర్ ప్రశ్నకి కమల్ హాసన్ అందరూ ఆశ్చర్యపోయే ఆన్సర్ ఇచ్చారు. రేపిస్టులు మంచోళ్లే ఎందుకంటే వారిని నిందించడం మంచి పని కాదు. అయితే ఇలా రేప్ లు చేయమని మహాభారతమే వారికి చెప్పింది. ఎందుకంటే ఎంతో పవిత్రమైనటువంటి మహాభారతం ఇలాంటి పనులు చేయవచ్చని ప్రోత్సహించినప్పుడు రేపిస్టులను నిందించడం తప్పు.. అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.అయితే కమల్ హాసన్ ఇచ్చిన ఆన్సర్ పై చాలా మంది నెటిజన్స్ రేపిస్ట్ లను హేట్ చేయడం పోయి అమ్మాయిల సంరక్షణకు ఏదైనా సొల్యూషన్ చెప్పడం పోయి ఇలా పురాణాల మీద తప్పంతా తోసేస్తారా.. 

అయినా మహాభారతం, రామాయణంలో ఆడవాళ్లను హింసించిన వారికి శిక్షలే పడ్డాయి తప్ప రామాయణ, మహాభారతాలు ఆడవాళ్లను హింసించిన వారిని రాజులుగా చేసి కూర్చోబెట్టలేదు. ఏ ఇతిహాసంలోనైనా సరే తప్పు చేసిన వాడికి కచ్చితంగా శిక్ష పడింది. అలాంటిది రేపిస్టులని మంచోళ్ళని మహాభారతం వల్లే వాళ్ళు ఇలా తయారవుతున్నారని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ మండిపడుతున్నారు. ఈయన వ్యాఖ్యలపై చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తున్నారు. ఎంత హిందుత్వంపై కోపం ఉన్నా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కమల్ హాసన్ కి సంబంధించిన ఈ వీడియో ఇప్పటిదైతే కాదు.. ఓల్డ్ వీడియో మళ్లీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. దాంతో మళ్లీ ఈ విషయం మరోసారి వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: