
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో సుజిత్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ నిన్న అనగా సెప్టెంబర్ 25 వ తారీఖున థియేటర్లలో రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది . ఇక ఈ సినిమాకి తమన్ బిజిఎం మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు . ప్రస్తుతం థియేటర్లను ఈ సినిమా షేక్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు . ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఉండడంతో ఈ సినిమాపై ప్రత్యక్ష పార్టీల అధినేతలు నెగటివ్ కామెంట్స్ చేయడం సర్వసాధారణం . ఈ క్రమంలోనే తాజాగా రోజా ఈ సినిమాపై నిప్పులు జిమ్మగా.. మరికొందరు ప్రత్యక్ష నేతలు ఈ సినిమాని నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు .
ఇక ఇదిలా ఉంటే తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సినిమాను చూసేందుకు థియేటర్ కి వెళ్లడం ఆశ్చర్యంగా మారింది . గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ మరియు జగన్మోహన్ రెడ్డి మధ్య అనేక వాగ్వాదాలు చోటు చేసుకుంటున్న సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం . ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఓజీ సినిమా చూసేందుకు థియేటర్ కి వెళ్లడంతో పవన్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు . అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పై పళ్ళు ట్రోల్స్ కూడా చేస్తున్నారు . " మా అన్నతో ఏమన్నా అవసరం ఉందా . ఇలా కాకా పట్టడానికి ప్రయత్నిస్తున్నావా? అయినా నీ పప్పులు ఏమి వడకవు " అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు పవర్ ఫ్యాన్స్ . ప్రజెంట్ ఎందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది .