
జె. శివకుమార్ దర్శకత్వంలో గోపీచంద్ నటించిన శౌర్యం సినిమా 2008లో విడుదలైంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్ మిక్స్ అవ్వడంతో ఈ మూవీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. చెల్లెల్ని విలన్ గ్యాంగ్ నుండి కాపాడుకోవడానికి ఓ అన్న ప్రాణాలు పణంగా పెట్టి చేసే పోరాటమే ఈ సినిమాకి సెంట్రల్ థీమ్. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో నడిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచి గోపీచంద్ కెరీర్‌లో మైలురాయి అయింది.
ఇదే కథాంశం ఆధారంగా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన `వేదాళం` రీమేక్‌గా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చేశారు. కానీ అదే రివెంజ్ డ్రామా, అదే చెల్లెలి ట్రాక్, అదే కలకత్తా సెటప్. 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, స్టోరీలో కొత్తదనం లేకపోవడం, నేరేషన్ బోరింగ్‌గా అనిపించడం వలన బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఒకే కాన్సెప్ట్‌తో గోపీచంద్‌కు హిట్ ఇచ్చిన కథ, చిరంజీవికి మాత్రం ఫ్లాప్ అయింది. టైమ్, ట్రీట్‌మెంట్, స్క్రీన్‌ప్లే అనే మూడు ఎలిమెంట్స్ సినిమా విజయాన్ని లేదా వైఫల్యాన్ని నిర్ణయిస్తాయని ఈ రెండు సినిమాలు మళ్లీ నిరూపించాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు