ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్‌లో ట్రోల్ అవుతున్న స్టార్ బ్యూటీ ఎవరు అంటే మాత్రం అందరు టక్కున చెప్పే పేరు బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “స్పిరిట్” సినిమా నుంచి దీపికా పదుకొనేని ఏ ముహూర్తాన తీసేశారో అప్పటి నుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. దానికి తోడు, ఇటీవల “కల్కి 2” టీమ్ కూడా ఆమెను సినిమా నుంచి తప్పిస్తున్నామంటూ అధికారికంగా ప్రకటించడం దీపికా ఇమేజ్‌ను మరింత డ్యామేజ్ చేసినట్టైంది. దీంతో సందీప్ రెడ్డి వంగ, దీపికా పదుకొనే మధ్య పెద్ద తగాదా నడుస్తోందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా, “కల్కి 2” టీమ్ ఆమెను తీసేసినట్లు చేసిన పోస్ట్‌కు సందీప్ రెడ్డి వంగ చేసిన రిప్లై ఇంకా హీట్ పెంచేశాడు.


దీపికా పదుకొనే తాజాగా వీటన్నింటిపై పరోక్షంగా స్పందించింది . దీపికా పదుకొనే ఓ ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నింది.  తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ —“ఒక ఆత్మాభిమానం ఉన్న నటిగా నేను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టే పని చేయను. కానీ ఎవరో నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే వాటిని అంగీకరించను. సినిమా ఇండస్ట్రీలో చాలామంది అగ్ర హీరోలు ఉన్నారు. వారు ఏళ్ల తరబడి కేవలం ఎనిమిది గంటలే పని చేస్తున్నారు. ఇది ఎవరికి తెలియని రహస్యం కాదు. అందరికీ తెలుసు. కానీ దీని గురించి ఎవరూ మాట్లాడరు, ఎప్పుడు వార్తల్లో రాదు. ఇప్పుడు నేను ఈ విషయాన్ని ప్రశ్నిస్తే మాత్రం నాపై దుష్ప్రచారం మొదలైంది. నన్ను టార్గెట్ చేశారు, ట్రోల్ చేశారు. చాలా మంది హీరోలు సోమవారం నుంచి శుక్రవారం వరకే పని చేస్తారు. వారం మొత్తం కూడా పనిచేయరు. అయినా వాళ్లపై ఎవరూ మాట్లాడరు. కానీ నేను ఒక్క మాట అన్నా మాత్రం వేర్వేరు రూల్స్ పెట్టేస్తారు.” అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది.



‘ఆడవాళ్లకు ఒక రూల్, మగవాళ్లకు ఒక రూల్’ నా అంటూ దీపికా మనసులోని  ఆవేదనను బయటపెట్టింది అంటూ జనాలు ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా దీపికా మాట్లాడుతూ..“నేను ఎన్నో పోరాటాలను నిశ్శబ్దంగానే ఎదుర్కొంటూ వస్తున్నాను. నాకు ఇది కొత్త కాదు. ఏ విషయంపై అయినా సైలెంట్‌గా నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్తాను.” ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. చాలా మంది నెటిజన్లు దీపికా చెప్పింది నిజమేనని, “ఆడవాళ్లకు ఒక రూల్, మగవాళ్లకు ఒక రూల్” అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం, “దీపికా పదుకొనే హీరోల పేర్లు చెబితే ఇండస్ట్రీ మొత్తం కుదేలైపోతుంది” అంటూ రియాక్ట్ అవుతున్నారు.ఇలా దీపికా పదుకొనే వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ రెండింటిలోనూ చర్చకు దారి తీస్తున్నాయి. ఆమె నిజంగానే చెప్పిన విషయాలు ఎంతో మందిని ఆలోచనలో పడేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: