
ఇదంతా ఇలా ఉండగా తాజాగా డ్యూడ్ సినిమా పైన కేసు వేసినట్లుగా వినిపిస్తోంది. అయితే ఈ సినిమా పైన కేసు వేసింది ఎవరో కాదు ప్రముఖ లెజెండ్రి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. ఈ చిత్రంలో ఇళయరాజా అందించిన చిత్రాలలోని పాట పుదు నెల్లు పుదు నాతు అనే పాటను ఉపయోగించారు. అయితే అది కూడా ఒక పెళ్లి సన్నివేశంలో ఈ పాటను ఉపయోగించడంతో ఈ సినిమా పైన కేసు వేసినట్లు తెలుస్తోంది. ఇళయరాజా ఇలా కేసు వేయడం మొదటిసారి కాదు. ఇప్పటికే చాలా చిత్రాల పైన కూడా కేసు వేశారు. తన పాత పాటలను అనుమతి లేకుండా సినిమాలలో ఉపయోగించకూడదనే దావ వేయడం జరిగింది.
ఇప్పుడు డ్యూడ్ సినిమా విషయంలో దావా వేయడానికి కోర్టు అంగీకరించింది. డ్యూడ్ చిత్రంలో కురుతమచ్చన్ అనే చిత్రంలోని పాటను ప్రదీప్ రంగనాథన్ , మమిత బైజు వివాహ సమయంలో ఉపయోగించారని, ఇందులోని పాట ఉపయోగించడం కోసం ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో తన పాటను ఉపయోగించారని మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు ఇళయరాజా. దీంతో ఇళయరాజా పిటీషన్ ని కూడా మద్రాస్ హైకోర్టు స్వీకరించింది. మరి ఈ విషయం పైన చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.