గత కొద్ది రోజుల నుండి టాలీవుడ్ లో ఫేమస్ సింగర్స్ గా పేరు తెచ్చుకున్న వారిద్దరి విడాకుల వార్తలు మీడియాలో హైలెట్ గా నిలిచాయి. అయితే వీరిద్దరూ ఇప్పటివరకు తమ విడాకుల వార్తలను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఏదో ఒక విషయం ద్వారా వీరి విడాకుల వార్తలు బయటకు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే దీపావళి పండగ సందర్భంగా వీరిద్దరి విడాకులకు అధికారిక క్లారిటీ వచ్చేసింది. మరి ఇంతకీ ఆ సెలబ్రిటీ సింగర్ కపుల్ ఎవరయ్యా అంటే శ్రావణ భార్గవి హేమచంద్ర.. టాలీవుడ్ లో ఫేమస్ సింగర్లుగా పేరు తెచ్చుకున్న శ్రావణ భార్గవి హేమచంద్ర ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తమ అద్భుతమైన గాత్రంతో పాటలు పాడి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అలాంటి ఈ ఇద్దరు సింగర్స్ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అలా ఇద్దరి ప్రొఫెషన్స్ ఒక్కటే కావడంతో ప్రేమలో పడిపోయారు. ఇక వీరి పెళ్లికి పెద్దలు ఓకే చెప్పడంతో గ్రాండ్గా పెళ్లి కూడా జరిగింది.

అలా ఈ ఇద్దరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఒక పాప కూడా పుట్టింది. అయితే అంతా బాగానే ఉంది కానీ సడన్గా ఏమైందే ఏమో శ్రావణ భార్గవి హేమచంద్ర మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నట్టు చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్లి తమ ఫోటోలను షేర్ చేసే ఈ జంట సడన్ గా ఎవరి ఫోటోలు వాళ్లే షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు.శ్రావణ భార్గవి సోషల్ మీడియాలో హేమచంద్ర ఫొటోస్ షేర్ చేయడం లేదు. అలాగే హేమచంద్ర కూడా అలాగే చేస్తున్నాడు. ఇక ఆ మధ్యకాలంలో శ్రావణ భార్గవి తన కూతుర్ని తీసుకొని ఒంటరిగా వెకేషన్ కి వెళ్లడంతో ఈ విడాకుల వార్తలు వైరల్ అయ్యాయి. అలా గత కొద్దిరోజుల నుండి శ్రావణ భార్గవి హేమచంద్ర విడాకుల వార్తలు వినిపిస్తున్న వేళ తాజాగా దీపావళి రోజు వీరిద్దరి విడాకులకు క్లారిటీ వచ్చింది.

దీపావళి పండుగ సందర్భంగా ఎంతో మంది సెలెబ్రెటీలు ఫ్యామిలీతో పండగ సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను, వీడియోలను నెట్టింట్లో షేర్ చేశారు. ఇందులో భాగంగా శ్రావణ భార్గవి కూడా తన ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి ఓ అమ్మ ఓ నాన్న ఓ అక్క ఓ తమ్ముడు అది స్టోరీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.శ్రావణ భార్గవి తన అమ్మ నాన్న తమ్ముడితో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకుంది.కానీ ఈ ఫోటోలో శ్రావణ భార్గవి కూతురు, భర్త ఇద్దరు మిస్ అయ్యారు. ఈ ఒక్క ఫోటోతో హేమచంద్ర శ్రావణ భార్గవిల విడాకులకు క్లారిటీ వచ్చేసింది. శ్రావణ భార్గవి భర్తకు దూరంగా ఉంటుందని అందరికీ అర్థమైంది. ఈ ఇద్దరికీ ఇంకా అధికారికంగా విడాకులు రాలేదు కావచ్చు అందుకే క్లారిటీ ఇవ్వడం లేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.ఏది ఏమైనప్పటికీ ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్టు అందరూ అనుకున్నదే నిజం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: