భారతదేశం మొత్తం గుర్తుంచుకునేలా, అందం అంటే ఏమిటి, గ్లామర్ అంటే ఏమిటి, స్క్రీన్ మీద చమక్కు అంటే ఏమిటి అనే నిర్వచనాన్ని మార్చిన పేరు — ఐశ్వర్య రాయ్. మోడలింగ్‌తో మొదలై, సినిమాల్లో మహా స్టార్‌గా ఎదిగిన ఈ అద్భుత ప్రయాణంలో ఒక చిన్న యాడ్ – పెప్సీ కమర్షియల్ – ఆమె కెరీర్‌కు తలుపులు తెరిచింది.ఐశ్వర్య రాయ్ మొదటగా సినిమాల గురించి కలలు కూడా కనలేదు. ముంబైలో ఆర్కిటెక్చర్ చదువుతున్నప్పుడు, అనుకోకుండా కొన్ని మోడలింగ్ ఆఫర్లు వచ్చాయి. ఆ రోజుల్లో ఆమె అందం గురించి ముంబై ఫ్యాషన్ సర్క్యూట్‌లో ఇప్పటికే చర్చ మొదలైంది. బ్లూ-గ్రీన్ కళ్లతో, స్మార్ట్ లుక్స్‌తో ఆమె ఒక ఫ్రెష్ ఫేస్‌గా నిలిచింది.

1993లో పెప్సీ ఇండియా ఒక కొత్త యాడ్ ప్లాన్ చేసింది. ఆ యాడ్‌లో అప్పటికే బిగ్ స్టార్స్ — అమీర్ ఖాన్ మరియు మహిమా చౌధరి నటించారు. కానీ ఆ యాడ్‌లో కొత్త ఫేస్‌గా కనిపించిన అమ్మాయి మాత్రం ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా దోచేసింది — ఆమెే ఐశ్వర్య రాయ్. ఆ యాడ్‌ అప్పట్లో యువతలో బాగా వైరల్ అయింది . ఆ ఒక్క యాడ్ తోనే ఆమెకి వచ్చిన క్రేజ్ ఊహించలేనిది. దేశమంతా “ఎవరు ఆమె?” అని అడగడం మొదలైంది. పెప్సీ యాడ్ తర్వాత ఐశ్వర్య పేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో వేగంగా ప్రచారం అయింది. అనేక దర్శకులు ఆమెని సంప్రదించడం మొదలుపెట్టారు. ఆమెకి వచ్చిన ఆరంభ అవకాశాల్లో ఒకటి మణిరత్నం దర్శకత్వం వహించిన “ఇరు వర్” ( తమిళ చిత్రం). అదే ఏడాది ఆమె బాలీవుడ్‌లో “ఆ ప్యార్ హో గయా” తో ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత “హమ్ దిల్ దే చుకే సనం”, “తాళ్”, “దేవదాస్” వంటి సినిమాలు ఆమెను లెజెండరీ స్థాయికి చేర్చాయి. కానీ ఈ మహా ప్రయాణం మొదలయినది ఒక చిన్న 30 సెకండ్ల యాడ్ ద్వారానే! అయితే అందులో ఆమె కనిపించింది కేవలం 4 సెకన్లు మాత్రమే.

ఆ యాడ్ లోని స్టైల్, సంగీతం, కెమెరా యాంగిల్స్ అన్నీ అప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించాయి. ఐశ్వర్య లుక్స్, హావభావాలు, ఆ చిరునవ్వు — అన్నీ కలిపి ఆమెను వెంటనే ఒక నేషనల్ క్రష్ గా మార్చేశాయి.అదీగాక ఆ యాడ్ టెలివిజన్ ఛానల్స్‌లో, సినిమా థియేటర్స్‌లో, స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో తిరుగుతూ ఉండడంతో, ఆమె ముఖం దేశమంతా తెలిసిపోయింది.పెప్సీ యాడ్ తర్వాత ఆమె మోడలింగ్‌లో మరింత పాపులర్ అయ్యింది. 1994లో ఆమె మిస్ ఇండియా పోటీకి వెళ్లి ఫస్ట్ రన్నర్-అప్‌గా నిలిచింది. ఆ తర్వాత అదే సంవత్సరం మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది.పెప్సీ యాడ్ ద్వారా వచ్చిన ఫేమ్, పబ్లిక్ రీకగ్నిషన్, మీడియా ఎక్స్‌పోజర్ ఇవన్నీ ఆమెను ఆ గ్లోబల్ ప్లాట్‌ఫాం వరకు తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర పోషించాయి. ఆ ఒక్క యాడ్ ద్వారా ఆమె సాధించినది కేవలం గుర్తింపు మాత్రమే కాదు — ఒక గుర్తింపుని స్టార్‌డమ్‌గా మార్చే అవకాశాన్ని కూడా అందించింది. మణిరత్నం వంటి దిగ్గజ దర్శకులు ఆమెను తమ సినిమాలకు తీసుకోవడానికి ఆసక్తి చూపారు. తర్వాతి దశలో ఐశ్వర్య కేవలం భారతీయ సినిమా ప్రపంచంలోనే కాదు, హాలీవుడ్ వరకు తన కాంతిని విస్తరించింది.హా ఈ స్థాయి గ్లోబల్ ప్రెజెన్స్‌కు బీజం వేసింది ఆ పెప్సీ యాడ్ అని చెప్పడం అతిశయోక్తి కాదు.





మరింత సమాచారం తెలుసుకోండి: