టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నితిన్ ఒకరు. నితిన్ తన కెరియర్లో ఇప్పటివరకు చాలా సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. నితిన్ కెరియర్ లో మంచి విజయం సాధించిన సినిమాలలో గుండెజారి గల్లంతయ్యిందే మూవీ ఒకటి. ఈ మూవీ లో నిత్య మీనన్ , నితిన్ కి జోడిగా నటించింది. ఈ మూవీ కంటే ముందు నితిన్ , నిత్యా మీనన్ కాంబో లో ఇష్క్ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా కంటే ముందు నితిన్ వరుస అపజయాలను ఎదుర్కొని కెరీర్ను అత్యంత డౌన్లో కొనసాగిస్తున్నాడు. ఆ సమయంలో నితిన్ కి ఇష్క్ మూవీ ద్వారా మంచి విజయం దక్కింది. ఆ సినిమాలో నితిన్ , నిత్యా మీనన్ జంటకు మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి. ఇక గుండెజారి గల్లంతయ్యిందే మూవీ లో కూడా వీరిద్దరి కెమిస్ట్రీ సూపర్ సాలిడ్ మార్క్స్ పడ్డాయి.

ఇకపోతే గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకు హీరో గా మొదటి ఆప్షన్ నితిన్ కాదట. మరో హీరోను ఆ సినిమాలో హీరో గా అనుకున్నారట. అందులో భాగంగా ఆయనకు కథను కూడా వివరించారట. కానీ ఆ హీరో ఆ సమయంలో ఆ మూవీ ని రిజెక్ట్ చేయడంతో నితిన్ కు గుండెజారి గల్లంతయ్యిందే  సినిమాలో ఆఫర్ వచ్చిందట. ఇంతకు గుండెజారి గల్లంతయ్యిందే సినిమాను రిజెక్ట్ చేసిన ఆ హీరో ఎవరో తెలుసా ..? ఆయన మరెవరో కాదు నాని. నాని కి మొదట గుండెజారి గల్లంతయ్యిందే మూవీ స్టోరీని మేకర్స్ వినిపించగా ఆయన కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. దానితో అదే మూవీ కథను నితిన కి వినిపించగా ఆయన ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా నాని రిజెక్ట్ చేసిన మూవీ లో నితిన్ హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: