నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369..ఈ అద్భుతమైన సినిమాని ఎలాంటి టెక్నాలజీ అందుబాటులోకి రాని సమయంలోనే  తెరకెక్కించారు.. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కిన మొదటి తెలుగు సినిమా ఇది అని చెప్పుకోవచ్చు.అయితే ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. అలా మన టాలీవుడ్ లో ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలోనే టైం మిషన్ నేపథ్యంలో ఆదిత్య 369 సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సంగతి మనకు తెలిసిందే. అలా శ్రీకృష్ణదేవరాయలుగా ఒక పాత్రలో నటించగా కృష్ణ కుమార్ గా మరో పాత్రలో నటించారు. అయితే అలాంటి ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయాల్సి ఉండేది కాదట.

ఎందుకంటే మరో పాత్ర కోసం దిగ్గజ నటుడు కమల్ హాసన్ ని తీసుకున్నారట. అలా కమల్ హాసన్ కి ఈ స్టోరీ బాగా నచ్చిందట కూడా. కానీ చివర్లో అంతా ఓకే అయిపోయాక కమల్ హాసన్ ఈ ప్రాజెక్టుని రిజెక్ట్ చేశారట.ఇక విషయంలోకి వెళ్తే.. బాలకృష్ణ హీరోగా మోహిని హీరోయిన్ గా నటించిన ఆదిత్య 369 మూవీ అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పాత్రకు బాలకృష్ణ అయితేనే న్యాయం చేయగలరని డైరెక్టర్ నిర్మాత ఇద్దరు అనుకొని ఈ పాత్రకి బాలకృష్ణనే అనుకున్నారట.

కానీ బాలకృష్ణ ప్లే చేసిన మరో రోల్ అంటే కృష్ణ కుమార్ పాత్ర కోసం కమల్ హాసన్ ని తీసుకోవాలి అనుకున్నారట. అలా వీరిద్దరి కాంబోలో మల్టీ స్టారర్ తీయాలి అనుకున్నారట.కానీ చివరికి కమల్ హాసన్ కి మరో రెండు సినిమాలు ఉండడంతో ఆ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండి ఆదిత్య 369 సినిమా చేయలేకపోయారు. అలా ఈ సినిమాలో కమల్ హాసన్ నటించిన పోయినప్పటికీ బాలకృష్ణ ద్వారానే ద్విపాత్రాభినయం చేయించారు.అలా ఈ సినిమా అద్భుత హిట్ సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: