దాదాపుగా స్టార్ హీరోలు నటించిన సినిమాలు కనీసం విడుదల అయిన నెల రోజుల తర్వాత ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం స్టార్ హీరోలు నటించిన సినిమాలకి గనుక మంచి టాక్ వచ్చినట్లయితే దాదాపు 50 రోజుల పాటు బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టే అవకాశాలు ఉంటాయి. దానితో ముందు గానే స్టార్ హీరోలతో సినిమాలను చేసే మేకర్స్ ఆ మూవీ లు విడుదల అయిన తర్వాత కనీసం నెల రోజుల తర్వాతే ఆ మూవీ ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇచ్చే విధంగా ఒప్పందాలను కుదుర్చుకుంటూ ఉంటారు.ఆ కారణంతో దాదాపు స్టార్ హీరోలు నటించిన సినిమాలు విడుదల అయిన నెల తర్వాత ఓ టీ టీ లోకి   ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి. ఇకపోతే తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన ఓ నటుడు నటించిన సినిమా కొంత కాలం క్రితమే విడుదల అయింది. ఆ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. అలాగే ఆ సినిమా మంచి కలెక్షన్లను వసులు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఆ సినిమా మాత్రం విడుదల అయిన నెల తిరగకుండా అనే ఓ టీ టీ లోకి  ఎంట్రీ ఇవ్వబోతుంది.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ధనుష్ "ఇడ్లీ కాడయ్"  అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ అక్టోబర్ 1 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్  సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా  అక్టోబర్ 29 వ తేదీన తమిళ్ , హిందీ , తెలుగు , కన్నడ , మలయాళ భాషల్లో ఈ మూవీ ని  స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: